Home » ఎన్టీఆర్ తో హరికృష్ణ రెండేళ్లు మాట్లాడలేదా ? కారణం ఏంటో తెలుసా ?

ఎన్టీఆర్ తో హరికృష్ణ రెండేళ్లు మాట్లాడలేదా ? కారణం ఏంటో తెలుసా ?

by Anji
Ad

తెలుగు సినిమా చరిత్రలోనే ఒక గొప్ప నటుడు రాజకీయ నాయకుడు నందమూరి తారకరామారావు.  సినీ  ఇండస్ట్రీలో ఎవ్వరూ  చేయని పాత్ర అంటూ లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంతటి పొజిషన్ కి వచ్చింది అంటే దాంట్లో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎంతో కొంత ఉంటుందని చెప్పకనే చెప్పవచ్చు.  అలాంటి ఆయన కేవలం సినిమాలల్లోనే కాకుండా రాజకీయంలో కూడా రాణించారు.  తెలుగు రాష్ట్రానికి సీఎంగా చేసి పేద ప్రజల కోసం ప్రత్యేకమైనటువంటి పథకాలు తీసుకువచ్చిన గొప్ప ధీరుడు.

అలాంటి ఎన్టీఆర్ నట వారసులుగా హరికృష్ణ,బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగారు  హరికృష్ణ ఓ మోస్తారు హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ కొడుకులందరిలో హరికృష్ణ అంటే ఆయనకు ఎక్కువ ఇష్టము మరియు నమ్మకమట. అందుకే తన రాజకీయానికి సంబంధించి అన్ని పనులు హరికృష్ణ చూసుకునేవారట. అంతేకాకుండా కోపం కూడా ఎక్కువగా ఉండేదట హరికృష్ణ కి. అయితే ఒకానొక సమయంలో హరికృష్ణ తన తండ్రిని ఒక కోరిక కోరారట. నాన్న ఒక థియేటర్ కట్టాలి అనుకుంటున్నాను అని చెప్పారట.

Advertisement

Advertisement

 

ఇదే విషయంపై ఎన్టీఆర్ తన ప్రాణ స్నేహితుడైన నాగేశ్వరరావు సలహా తీసుకున్నారట. నా కొడుకు థియేటర్ కట్టాలి అంటున్నాడు అది కడితే బాగుంటుందా అని అడిగారట. దీంతో నాగేశ్వరరావు థియేటర్ కంటే స్టూడియో కడితే బెటర్ అని సలహా ఇచ్చారట. దీంతో వెంటనే స్టూడియో పనులు స్టార్ట్ చేశారట ఎన్టీఆర్.  హరికృష్ణ థియేటర్ కట్టాలని అంటే పట్టించుకోని తండ్రి స్టూడియో కట్టడానికి పూనుకోవడంతో హరికృష్ణ తండ్రితో రెండు సంవత్సరాల పాటు మాట్లాడడం మానేశారట. ఆ తర్వాత థియేటర్ స్థానంలోనే స్టూడియో కట్టారని తెలుసుకొని  తన తండ్రితో మళ్ళీ మాట్లాడారట హరికృష్ణ.

Visitors Are Also Reading