సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎంత మంది దర్శకులు ఉన్నప్పటికీ ప్రధానంగా రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్స్ వచ్చినా శంకర్ బ్రాండ్ కి ఉన్న క్రేజ్ నే వేరు అని చెప్పవచ్చు. అలాంటి శంకర్ కెరీర్ లో ఆణిముత్యం లాంటి సినిమా ‘భారతీయుడు’. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేసింది. ఒక్క తమిళం లో మాత్రమే కాదు.. హిం,దీ తెలుగు భాషల్లో కూడా ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Advertisement
అయితే ఈ చిత్రాన్ని శంకర్ అప్పట్లో ద్విభాషా చిత్రం గా చేద్దాం అనుకున్నాడు. తమిళం లో కమల్ హాసన్ తో, అలాగే తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి తో చేయాలని అనుకున్నాడట. చిరంజీవి ని కలిసి స్టోరీ కూడా వినిపించాడట శంకర్. అయితే మీ పాత్ర ఇలా ఉండబోతుంది అని కమల్ హాసన్ తో తీసిన కొన్ని సన్నివేశాలను చిరు కి చూపించాడట. అవి చూసిన చిరంజీవికి మైండ్ బ్లాక్ అయినంత పని అయ్యింది.ఈ స్థాయి నటన ని నేను మ్యాచ్ చేయలేనని.. నేను ఎంత బాగా చేసిన కమల్ హాసన్ నటన తో పోలిస్తే తక్కువే ఉంటుంది అని నా మనసుకి అనిపిస్తుందని.. సంతృప్తి తో ఈ చిత్రాన్ని చేయలేనని చెప్పేశాడట.
Advertisement
ఇక వేరే వాళ్ళతో కూడా ఈ క్యారక్టర్ చేయించాలని అనుకోకండి. ఇది కమల్ హాసన్ గారి కోసమే పుట్టినట్టు అనిపిస్తున్న పాత్ర. తెలుగు లో కూడా మీరే డబ్ చేయించి విడుదల చేయండి అని చెప్పాడట. అదేవిధంగా తెలుగులో కచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పాడట చిరంజీవి. ఆయన చెప్పినట్టుగానే తెలుగు లో డబ్ చేసి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అప్పట్లో సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం భారతీయుడు 2కి సీక్వెల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏ చిత్రం ఏ రేంజ్ లో ఉంటుందో వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
నాగ చైతన్య సినిమా కి సాయి పల్లవి రెమ్యూనరేషన్ అంత తీసుకుంటుందా..?