Home » ఏజ్ పెరిగినా.. క్రేజ్ త‌గ్గ‌లేదు. ఈ ఫోటో ఉన్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

ఏజ్ పెరిగినా.. క్రేజ్ త‌గ్గ‌లేదు. ఈ ఫోటో ఉన్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

by Azhar
Ad

సినీ ఇండ‌స్ట్రీలో ఎంత కాల‌మైన హీరోల‌ను గుర్తుప‌ట్టిన‌ట్లు కాస్త గ్యాప్ వ‌స్తే మాత్రం హీరోయిన్ల‌ను గుర్తుప‌ట్ట‌లేం. దానికి కార‌ణం లేక‌పోలేదు. ఒకసారి పెళ్ళైందంటే చాలామంది ఆడ‌వారిలో శ‌రీర ఆకృతి మారిపోతుంది. అందులోనూ హీరోయిన్లు అంటే వారు మొహాల‌కి మేక‌ప్ వేసి వేసి ఉండ‌డం వ‌ల్ల వారి స్కిన్‌టోన్ అనేది కాస్త దెబ్బ‌తింటుంది. ఒకప్పుడు టాలీవుడ్ లోని అగ్రహీరోలతో క‌లిసి ఆడిపాడిన హీరోయిన మీనాక్షి శేషాద్రి. వివాహానంతరం అమెరికాలో స్థిరపడింది. ఆమె అసలు పేరు శశికళ శేషాద్రి. ఈమె జార్ఖండ్ రాష్ట్రంలోని సింధిలో జన్మించింది. ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అంతా త‌మిళియ‌న్స్ అనిచెప్పాలి.

Advertisement

ఈమె.. చాలా మంచి డాన్స‌ర్‌ భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిసి లాంటి డాన్సులలో ప్రావీణ్య ముంది. ఢిల్లీలో చదువుకునే సమయంలోనే మిస్ ఇండియాలో పాల్గొని సెలక్ట్ అయ్యింది. ఇక ఈమెకు మోడల్ గా కూడా అప్ప‌ట్లోనే చాలా ఛాన్స్‌లు రావడంతో టాప్ మెడల్ గా పేరు తెచ్చుకుంది. అదే ఆమెను సినీ జీవితం వైపు నడిపించాయి. పెయింటర్ బాబుతో సినీ రంగ ప్రవేశం చేసిన మీనాక్షి, హీరో సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టి.. ఒక్కరోజులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్ కపూర్, సన్ని డియోల్ వంటి స్టార్ హీరోల సరసన నటించి బాలీవుడ్ ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయింది. అలాగే తెలుగులోనూ చిరంజీవితో కలిసి నటించి మెప్పించింది. అన్న ఎన్టీఆర్, బాలయ్య కలిసి నటించిన విశ్వామిత్ర సినిమాలో మేనక పాత్ర పోషించింది. అంతేకాదు మీనాక్షి1980-90లలో భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈమె అమెరికాలో కుటుంబంతో గడుపుతున్నారు. అక్కడ ఆమె ఇంట్రస్ట్ ఉన్నవాళ్లకి భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యం నేర్పుతున్నారు.

Advertisement

Heroine Meenakshi Seshadri

Heroine Meenakshi Seshadri

 

మీనాక్షి శేషాద్రికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఆమెను చూసిన నెటిజన్లు గుర్తించలేకపోతున్నారు. అప్పట్లో కుందనపు బొమ్మలా ఎంతో అమాయ‌క‌పు ముఖంతో అంద‌ర్నీ ఆక‌ట్టుకునేది. ఇప్పుడు ఆమెకు 57 సంవత్సరాలు. దీంతో వృద్దాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. ఆమె ఎలా ఉన్నా ఎప్పటికీ తమ ఫేవరెట్ హీరోయినే అంటున్నారు మీనాక్షి శేషాద్రి ఫ్యాన్స్. ఇక వృద్ధాప్యం అన్న‌ది కేవ‌లం వారి శ‌రీరాల‌కి మాత్ర‌మే కాని వీరి ఆలోచ‌న‌ల‌కు కాదుగా. అందుకే కొంత మంది ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ గా అలానే ఉండిపోతారు.

Also Read: “బుల్లెట్టు బండి” సాంగ్ పాడిన అసలు సింగర్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Visitors Are Also Reading