Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » బాలయ్య సినిమాల్లో ఇదీ స్పెషల్… గమనించారా?

బాలయ్య సినిమాల్లో ఇదీ స్పెషల్… గమనించారా?

by Bunty
Ads

నరసింహ నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఇక టాలీవుడ్ లో ఆయన అంటే పడి చచ్చే నందమూరి అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇటీవల విడుదలైన ఆకండ రచ్చ చూస్తే ఆ విషయం ఈజీగా అర్థమవుతుంది. ఈ సీనియర్ హీరో ఇప్పటికీ ఎంతోమంది అభిమానిస్తున్నారు. కొన్నిసార్లు ఆయన ప్రవర్తన వింతగా అనిపించినప్పటికీ, బాలయ్య ని దగ్గరగా చూసిన వాళ్లు మాత్రం ఆయన మనసు స్వచ్ఛమైనది అని చెబుతూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే బాలకృష్ణ చేసే పనులు పనులు చూస్తే ఈ విషయం నిజమే అనిపిస్తుంది. ఇప్పటికే ఎంతోమందికి సహాయం అందించిన బాలయ్య, పలువురుని ఆదుకున్న విషయం కూడా తెలిసిందే. సామాజిక సేవలు ముందుండే ఆయన సినిమా ఇండస్ట్రీ మంచి గురించి కూడా ఎక్కువగానే ఆలోచిస్తారు.

Advertisement

Advertisement

BALAKRISHNA

BALAKRISHNA

అందుకే ఆయన సినిమాలో ఎప్పుడూ ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అదేంటంటే వరుస ఆఫర్లతో ఉండే స్టార్ నటీనటులు ఎవరూ ఆయన సినిమాల్లో ఎక్కువగా ఉండరు. ఒకరిద్దరు మినహా రెగ్యులర్గా సినిమాల్లో కనపడే స్టార్ నటులు బాలయ్య సినిమాలో అసలు కనిపించరు. దాదాపుగా తెలుగు వారికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒకప్పుడు మంచి సినిమాల్లో నటించి ఇప్పుడు ఏ అవకాశాలు రాక, ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని ఎదురు చూసే వాళ్లు బాలకృష్ణ సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. తెలుగు వారికి కాకుండా బయట వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు అంటూ వాపోయే తెలుగు నటీనటులకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయం.

Ad

Visitors Are Also Reading