మధుమేహం, రక్తపోటు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు రకరకాల ఇంటి చిట్కాలను వినియోగిస్తున్నారు. అంతేకాదు.. జిమ్ లో కూడా గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు. శరీర బరువును నియంత్రించుకోవడానికి తప్పకుండా ఆహారంలో తెల్ల శనగలను వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అంతేకాదు.. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గడానికి తెల్ల శనగలను ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఆధునిక జీవన శైలిని అనుసరించే చాలా మందిలో ఊబకాయం వంటి సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు.. చాలా మంది పోషకాహార నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 28 గ్రాములతెల్ల శనగలతో 102 కేలరీలు లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలుంటాయి. ఇందులో 40 శాతం ఫైబర్, 70 శాతం ఫోలేట్ 22 శాతం ఐరన్ ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది. దీంతో సులభంగా శరీర బరువు తగ్గుతారు. ప్రధానంగా బెల్లీ ఫ్యాట్ నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు.. రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Advertisement
తెల్ల శనగలలో పీచు, ప్రోటీన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల సులభంగా 25 శాతం శరీర బరువును నియంత్రించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు.. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇప్పటికే ప్రోటీన్ సమస్యలతో బాధపడేవారు తెల్ల శనగలను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీర ప్రోటీన్లను తగ్గించే చాలా రకాల గుణాలున్నాయి. దీంతో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. తెల్ల శనగలను కేవలం అల్పాహారంలో తీసుకుంటే.. శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రాత్రి భోజనం చేసిన తరువాత అకస్మాత్తుగా ఆకలిగా అనిపించినా తినవచ్చు. నీటిలో నానబెట్టిన ఉడకబెట్టుకుని తినడం వల్ల శరీరం చాలా దృఢంగా తయారవుతుంది.
Also Read : రోజుకు ‘టీ’ ఎన్ని కప్పులు తాగాలో మీకు తెలుసా ?