భారతదేశంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఉంది. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థగా మన రైలు మార్గానికి గుర్తింపు ఉంది. మొత్తం 68000 కిలోమీటర్లు పైగా రైలు మార్గం విస్తరించి ప్రతిరోజు లక్షలాదిమందిని వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఈ రైల్వే సంస్థ పై ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. ఏది ఏమైనా ఇండియాలో మొదటిసారిగా రైల్వే వ్యవస్థను బ్రిటిష్ వారు స్థాపించారు.. ముందుగా ముంబై నుంచి థానే వరకు ప్రారంభించిన రైలు మార్గం దేశవ్యాప్తంగా విస్తరించింది. అలాంటి రైళ్ల విషయంలో మనకు తెలియని అనేక విషయాలు ఉన్నాయి.
Advertisement
also read;నాగార్జున కోడలితో యంగ్ హీరో ప్రేమాయణం నిజమేనా.? పెళ్లికి అదే అడ్డొస్తుందా..?
ముఖ్యంగా రైల్లో ప్రయాణించేటప్పుడు పగటిపూట కంటే రాత్రి సమయంలోనే అది ఎక్కువ వేగంగా వెళుతుంది. మరి అలా ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పగటిపూట రైల్వే ట్రాక్ పై సంచారం ఎక్కువగా ఉంటుంది. మనుషులు, వాహనాలు, జంతువులు వంటివి ట్రాక్ మీదకు వస్తూ పోతూ ఉంటాయి. ఈ క్రమంలో రైలు వేగంగా వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి పగటిపూట కాస్త వేగం తగ్గింపుతో వెళ్తాయి రైళ్లు. రాత్రిపూట అయితే ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉండవు.
Advertisement
అంతేకాకుండా ట్రాకులపై సిగ్నల్స్ చాలా క్లియర్ గా రాత్రిపూట కనిపిస్తాయి. వీటి ఆధారంగా లోకో పైలట్లు అన్ని గమనించుకుంటూ చాలా స్పీడ్ గా రైలు నడిపిస్తారు. ఒకవేళ దూరంగా ఉన్నప్పుడే రైలు ఆపాల్సి వస్తే సిగ్నల్స్ ఆధారంగా ఆపేస్తారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్ కి ఏదైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే పగటి పూట ఎక్కువ చేస్తారు. రాత్రిపూట ఎక్కువ మరమ్మత్తులు చేయరు కాబట్టి రైలు స్పీడ్ గా వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రిపూట ప్రయాణికుల రద్దీ కూడా చాలా తక్కువగా ఉంటుంది.కాబట్టి రైలు వేగంగా వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే పగటిపూట కంటే రాత్రిల్లే రైళ్లు వేగంగా వెళుతూ ఉంటాయి.
also read;రోజా కూతురి ఫొటోలు మార్ఫింగ్.. కన్నీరు పెట్టుకున్న నటి