Home » వాట్సప్ లో కొత్తగా ఈ ఆప్షన్ వచ్చిందని తెలుసా ?

వాట్సప్ లో కొత్తగా ఈ ఆప్షన్ వచ్చిందని తెలుసా ?

by Anji
Ad

ప్ర‌ముఖ మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ వాట్సాప్ యూజ‌ర్ల‌కు ఓ శుభ‌వార్త అనే చెప్పాలి. యూజ‌ర్ల సౌక‌ర్య‌వంతం కోసం వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్‌లు, కొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న విష‌యం విధిత‌మే. తాజాగా ఇప్ప‌టికే ఉన్న డిలీట్ ఫ‌ర్ ఎవ‌రివ‌న్ ఆప్ష‌న్‌ను అప్‌డేట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. వాట్సాప్ బ్లాగ్ వీ బీటా ఇన్ఫో ప్ర‌కారం.. యూజ‌ర్లు ఏదైనా సందేశాన్ని మిస్టేక్ ఉంటే డిలీట్ చేసే స‌దుపాయ‌ముంది.

Advertisement

అయితే పొర‌పాటు ఉన్న ఆ సందేశాల‌ను స‌మ‌యానికి డిలీట్ చేయ‌క‌పోతే ఎన్ని అన‌ర్థాలు సంభ‌విస్తాయో ఇక మ‌న‌కు తెలియ‌ని విష‌యం కాదు. ఆ స‌మ‌స్య‌కు ప‌రిష్కార మార్గంగా వాట్సాప్ 2017లో డిలీట్ ఫ‌ర్ ఎవ‌రివ‌న్ ఆప్ష‌న్‌ను యూజ‌ర్ల‌కు ప‌రిచ‌యం చేసింది. పొర‌పాటున మీ వాట్సాప్‌లో మీ కుటుంబ స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు పంపిన సందేశాలు, ఫోటోలు, వీడియోలు పంపించితే వాటిని కూడా డిలీట్ చేసే స‌మ‌యానికి 1గంట 8 నిమిషాల 16 సెక‌న్ల లోపు ఎప్పుడైనా డిలీట్ చేయ‌వ‌చ్చు. ఆ త‌రువాత వాటిని డిలీట్ చేయాల‌న్న సాధ్య‌ప‌డేది కాదు.

Advertisement


అందుకే ఆ స‌మ‌యంలో ఫ్రేమ్‌ను పొడిగిస్తూ డిలీట్ ఫ‌ర్ ఎవ‌రివ‌న్ ఆప్ష‌న్‌ను అప్‌డేట్ చేసింది. ఈ అప్‌డేట్ ప్ర‌కారం.. మిస్టేక్ ఉన్న మెసేజ్‌ల‌ను డిలీట్ చేసేందుకు 2 రోజుల 12 గంట‌ల స‌మ‌యం వ‌ర‌కు పొడ‌గింపు చేసింది. ఈ ఆప్ష‌న్ ప్ర‌స్తుతం టెస్టింగ్ ద‌శ‌లో ఉంది. అత్యంత త్వ‌ర‌లోనే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న‌ద‌ని వీ బీటా ఇన్ఫో త‌న బ్లాగ్‌లో వెల్ల‌డించింది. ఈ ఆప్ష‌న్ క‌నుక అందుబాటులోకి వ‌స్తే ఎంతో మంది ఉప‌యోగప‌డుతుంద‌ని వాట్సాప్ వినియోగ‌దారులు సంబ‌ర‌ప‌డుతున్నారు. ఇంకా మ‌రిన్నికొత్త ఆప్ష‌న్‌ల‌ను తీసుకొస్తే బాగుంటుంద‌ని పేర్కొంటున్నారు.

Also Read : 

పెళ్ళికి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు… ఎందుకు ?

Visitors Are Also Reading