ప్రస్తుతం సినీ పరిశ్రమలో పట్టి పీడిస్తున్న వాటిలో పైరసీ అనేది ఒకటి. ప్రపంచంలో సినిమా ఎప్పుడు, ఎక్కడ విడుదలైనా సరే కొన్ని క్షణాల్లోనే ఆన్‌లైన్‌లోకి ప్రింట్ వచ్చేస్తుంది. ప్రతీ సినిమా పైరసీకి బలవుతోంది. అసలు తెలుగులో పైరసీకి గురైన తొలి సినిమా ఎవరిదంటే రెబల్ స్టార్ కృష్ణంరాజుదే కావడం విశేషం.
కృష్ణంరాజు కథానాయకుడిగా టైటిల్ పాత్రలో నటించి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా తాండ్ర పాపారాయుడు. టాలీవుడ్ లో అప్పుడప్పుడే ప్రారంభమైన వీడియో పైరసీకి బలైన తొలి సినిమా తాండ్ర పాపారాయుడు. ఈ సినిమాకి భారీగా డబ్బు ఖర్చు చేసినప్పటికీ ఆస్థాయిలో డబ్బులు మాత్రం రాలేదు. ఇక ఆర్థికంగా తనకు లాభాలు రానప్పటికీ మంచి పేరు రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అప్పట్లో ఏపీ ప్రభుత్వం సినిమా విడుదల విషయంలో పర్సంటేజ్ పద్దతి ఎత్తేసి స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చిన తరువాత విడుదలైన మొదటి సినిమా బొబ్బిలి బ్రహ్మన్న. ఆ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : KRISHNAM RAJU DEATH : కృష్ణంరాజు మరణానికి కారణాలు ఇవే.. ఏఐజీ డాక్టర్లు ఏమన్నారంటే..?
ఆ రోజుల్లో తెలుగు సినిమా స్టామినా ఎంత ఉందనేది చెప్పిన సినిమాల్లో అదొకటి. ఆ విజయం ఉత్సాహం ఇవ్వడంతో హాలీవుడ్ సినిమా టెన్ కమాండ్‌మెంట్స్ బాలీవుడ్ సూపర్ హిట్ మొఘల్ ఏ అజాం తరహాలో భారీ సినిమా తీయాలని కృష్ణంరాజు సంకల్పించారు. సాంఘిక కథ అంటే చారిత్రాత్మక కథను ఎంపిక చేసుకుంటే బాగుంటుందని భావించి తాండ్ర పాపారాయుడు ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ సినిమా చేయాలనుకున్న తరువాత కొండవీటి వెంకట కవితో ఏడాది పాటు కథ వర్క్ చేయించారు. చరిత్రను క్షుణ్ణంగా స్టడీ చేసిన తరువాత స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. అప్పటికే కృష్ణంరాజుకి కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడి వంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు దాసరి నారాయణరావు. తాండ్ర పాపారాయుడు వంటి సినిమా దాసరి తీయగలడని కృష్ణంరాజు సంప్రదించారు.
ఇది కూడా చదవండి : టాలీవుడ్‌లో మరో విషాదం.. రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత