బిగ్ బాష్ షో తో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటులలో సొహైల్ కూడా ఒకరు. హౌస్ లో తన ఆటతీరుతో చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక టాలెండెడ్ యాక్టర్ షో నుంచి బయటికి వచ్చిన తరువాత హీరోగా ఛాన్స్ దక్కించుకున్నాడు. అలా అతను హీరోగా నటించి, గత ఏడాది చివరిలో విడుదలైన చిత్రం లక్కీ లక్ష్మన్. ఏ.ఆర్. అభి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోక్ష హీరోయిన్ గా నటించింది.
Advertisement
ఇక ఈ చిత్రంలో దేవీ ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2022 డిసెంబర్ 30న విడుదలైన ఈ ఫన్నీ ఎంటర్ టైనర్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. అయితే సొహెల్ నటన, సినిమాలో కామెడీ సీన్లు చాలా మందిని ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే లక్కీ లక్ష్మణ్ ఓటీటీ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నిరీక్షణకు తెర పడింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ సిద్ధమైపోయింది. లక్కీ లక్ష్మణ్ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతమవుతుంది.
Advertisement
ఫిబ్రవరి 17న లక్కీ లక్ష్మణ్ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలతో సక్సెస్ పుల్ గా మారిన ఓ లక్ష్మణుడి కథ అని ఈ విషయాన్ని అధికారికంగా ఆహా మేకర్స్ ప్రకటించారు. ఇదే రోజు సుడిగాలి సుధీర్ నటించినటువంటి గాలోడు, సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం వంటి చిత్రాలు కూడా ఆహాలో విడుదల కానున్నాయి. దీంతో ఈ వారం ఆహా వీక్షకులకు పండుగ అనే చెప్పాలి.
Also Read : హీరోయిన్ అనుష్కకి ఉన్న వ్యాధి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!