భారత టెక్నిస్ కి గ్లామర్ ని అందించి స్టార్ ఎదిగింది సానియా మీర్జా. ఒక మామూలు క్రీడా కారణిగా ప్రారంభమైన సానియా ప్రస్థానం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఎన్నో టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. ఎంతో సంపాదించింది. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా షోయబ్ మాలిక్ కి విడాకులు ఇచ్చేసి మరింత షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సానియా వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
సానియా మీర్జా తన చిన్ననాటి స్నేహితుడు మహ్మద్ సోహ్రాబ్ మీర్జాతో నిశ్చితార్థం జరిగిన తరువాత పెళ్లిని రద్దు చేసుకుంది. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికే మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షోయబ్ మాలిక్ కంటే ముందే టెన్నిస్ స్టార్ హైదరాబాద్ లోని ప్రముఖ బేకరీ చైన్ యూనివరల్ బేకర్స్ యజమాని సోహ్రబ్ మీర్జాతో నిశ్చితార్థం చేసుకున్నారు. జులై 2009లో వీరు ఉంగరాలు కూడా మార్చుకున్నారు. సానియా, సోహ్రాబ్ లు ఏడడుగులు నడవడానికి కూడా సిద్ధమయ్యారు. అసలు ఏమైందో ఏమో తెలియదు కానీ నిశ్చితార్థం జరిగిన 6 నెలలకే ఈ జంట విడిపోయినట్టు సమాచారం.
తొలిసారిగా సానియా ని సోహ్రబ్ హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కళాశాలలో కలిశాడు. ఆమె అక్కడ చదువుకునే రోజుల్లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అదే కాలేజీలో కామర్స్ చదివాడు. ఆ తరువాత యూకే లో ఎంబీఏ చదివాడు. ప్రస్తుతం సానియా-షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారు. సానియా-సోహ్రబ్ నిశ్చితార్థం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ కొనసాగుతోంది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!