పాన్ ఇండియా స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కేవలం దర్శకుడు మాత్రమే కాదు అంతకు మించి అన్నట్టుగా ఇండియన్ సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ముఖ్యంగా బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత రాజమౌళి ఇమేజ్ ను దాటేసినది. తాజాగా త్రిబుల్ ఆర్ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా మరోసారి గుర్తింపు తెచ్చుకున్నాడు.
రాజమౌళి నటుడు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. రాజమౌళి పెద్ద డైరెక్టర్ తన సినిమాల్లో హీరోలకు సీన్లు వివరించేటప్పుడు రాజమౌళి నటించి చూపిస్తాడట. అది మాత్రమే కాదు రాజమౌళి ఓ సినిమాలో బాల నటుడిగా కూడా వెండితెరపై కనిపించాడు అన్నది చాలా తక్కువ మందికి తెలుసు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు రాజమౌళి నే త్రిబుల్ ఆర్ ప్రమోషన్లలో వెల్లడించారు.రాజమౌళి బాల నటుడి గా నటించిన సినిమా పేరు పిల్లనగ్రోవి. 1983 లో ఆ సినిమా షూటింగ్ జరిగింది. అప్పుడు రాజమౌళి వయసు 10 సంవత్సరాలు. రాజమౌళి బ్యాడ్ లక్ ఏమిటంటే ఆ సినిమా విడుదల కాలేదు. ఇంతకాలానికి ఎట్టకేలకు ఇప్పుడు రాజమౌళి తాను బాలనటుడిగా కనిపించిన ఆ విషయాన్ని స్వయంగా చెప్పాడు. ఇప్పటివరకు ఈ విషయం ఎవరికీ తెలియదట.
Advertisement
Advertisement
రాజమౌళి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి ఈ సినిమా విడుదల అయి ఉంటే నటన వైపు వెళ్ళే ఉండే చాన్స్ వచ్చేదేమో అని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ల సమయంలో లో ఎన్టీఆర్ రాజమౌళి మధ్య చిన్న డిస్కషన్ నడిచింది. తాను సీనియర్ అంటే తాను సీనియర్ అని వాదించుకున్నారు. అప్పుడు రాజమౌళి నువ్వు సినిమాల్లోకి రాకముందే తాను సీరియల్ డైరెక్టర్ అని రాజమౌళి అన్నారు. వెంటనే ఎన్టీఆర్ అంతకంటే ముందే తాను బాలనటుడిగా నటించానని కౌంటర్ ఇచ్చాడు. అందుకు రాజమౌళి స్పందిస్తూ.. నీ కంటే ముందే నేను బాలనటిగా పిల్లనగ్రోవి సినిమాలో నటించానని రహస్యాన్ని బయటపెట్టాడు. ఇన్నాళ్లకు ఈ విషయం ఇలా బయటకు వచ్చింది.
Also Read : అల్లు అర్జున్ రీల్ లైఫ్ తల్లి జీవితంలో ఇన్ని కష్టాలు పడిందా….చదివితే కన్నీళ్లు ఆగవు ….!