Home » అల్లు అరవింద్ కు సంతానం నలుగురు అనే విషయం మీకు తెలుసా ?

అల్లు అరవింద్ కు సంతానం నలుగురు అనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ కమెడీయన్ అల్లు రామలింగయ్య తనయుడిగా  అల్లు అరవింద్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. నటుడిగా కాకుండా నిర్మాతగా కెరీర్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు.  గీతా ఆర్ట్స్ బ్యానర్ పై టాలీవుడ్ ప్రేక్షకులకు ఎన్నో సినిమాలను అందిస్తున్నారు.  ఇటీవలే కాంతార సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విడుదల చేసి మంచి లాభాలను సంపాదించారు అల్లు అరవింద్.  అల్లు అరవింద్ కు అల్లు అర్జున్, అల్లు శిరిష్ ఇద్దరు కుమారులే అని చాలా మంది అనుకుంటున్నారు. వాస్తవానికి అల్లు అరవింద్ కు మొత్తం నలుగురు కుమారులు అనే విషయం చాలా మందికి తెలియదు. మిగతా వారు ఎవరు ఏం చేస్తున్నారు ? ఉన్నారా ? లేరా అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

అల్లు అరవింద్ కి వాస్తవానికి అల్లు వెంకటేష్ (బాబీ) మొదటి అబ్బాయి.  వెంకటేష్ తరువాత రాజేష్ జన్మించాడట.  వీరిద్దరి తరువాత అల్లు అర్జున్ పుట్టాడట. ఐదారేళ్ల వయసులోనే రాజేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడట. అప్పటికీ అల్లు శిరిష్ ఇంకా పుట్టలేదట. అన్న రాజేష్ మరణించిన తరువాత అల్లు శిరిష్ పుట్టాడట. ఇలా అల్లు అరవింద్ కి నలుగురు కుమారులు అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో శిరిష్ వెల్లడించారు.  అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ అలియాస్ బాబీ రీసెంట్ గా వరుణ్ తేజ్  గనీ సినిమాతో నిర్మాతగా మారాడు.

Advertisement

అల్లు బాబికి కొండంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ తనకంటూ సొంత గుర్తింపు ఉండడం కోసం ఐటీ రంగంలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు.  గీతా ఆర్ట్స్ సినీ నిర్మాణంలో కూడా తెర వెనుక తన పాత్రను సమర్థవంతంగా నడిపించారు. లండన్, ఆస్ట్రేలియాలో ఇంజినీరింగ్ మేనేజ్ మెంట్ మాస్టర్స్ చేసి టెక్నాలజీ ఇంటర్ ప్రీటర్ గా తన కెరీర్ ప్రారంభించారు. అదే రంగంలో దాదాపు 15 సంవత్సరాల పాటు అక్కడే ఉండి సరికొత్త ఆలోచనలకు తెరతీశారు. ఎన్విరాన్ మెంట్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లాంటి ఎన్నో సరికొత్త ఆలోచనలతో ఒకటిన్నర దశాబ్ధం పాటు ఐటీ రంగంలో తనవంతు కృషి చేశారు. ఆ తరువాత మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ లో సినిమాటిక్ వంటి ఇన్నోవేటివ్స్ ప్రారంభించారు.

Also Read :  విడాకుల త‌ర‌వాత మ‌ళ్లీ పెళ్లి జోలికి వెళ్ల‌కుండా సింగిల్ గా ఉంటున్న 8 మంది టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!

Allu  Aravind Family : Manam News

జస్ట్ టికెట్స్ పేరుతో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఆన్లైన్ టికెట్లను అమ్మకానికి అంకురార్పణ చేశాడు. ప్రస్తుతం  జస్ట్ టికెట్స్ కి  చైర్మన్ గా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం తరుపున ఆన్ లైన్ టికెట్ ను రూపకల్పన చేసే బాధ్యతలు కూడా అల్లు బాబీనే తీసుకోవడం విశేషం. తెలుగు వారి తొలి ఓటీటీ ఆహా కోసం టెక్నాలజీ పరంగా ఎన్నో మెళుకువలు అందించారు. అదేవిధంగా ప్రాడక్ట్ స్ట్రాటజీ విషయంలో కూడా ప్రేక్షకుల్లోకి విజయవంతంగా తీసుకురావడానికి రోడ్డు మ్యాప్  సిద్ధం చేశారు అల్లు బాబీ. టెక్నికల్ రంగంలో అద్భుతాలను క్రియేట్ చేసిన బాబీ ముందు ముందు ఎలాంటి మాయ చేస్తాడ వేచి చూడాలి. మొత్తానికి తమ్ముళ్లిద్దరూ తెర ముందు అలరిస్తుంటే.. అన్న అల్లు బాబీ మాత్రం తెర వెనుక అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారనే చెప్పాలి.

Also Read :  విడాకుల త‌ర‌వాత మ‌ళ్లీ పెళ్లి జోలికి వెళ్ల‌కుండా సింగిల్ గా ఉంటున్న 8 మంది టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!

Visitors Are Also Reading