నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన మాస్ డైలాగ్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఆయన పర్ఫామెన్స్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇటీవలే బాలయ్య అఖండ విజయంతో మంచి ఊపుమీద ఉన్నారు. బాలకృష్ణ కెరీర్‌లో హిట్ సినిమాలు ప్లాఫ్ సినిమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ-రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
1974లో తమ సొంత బ్యానర్ ఎన్టీఆర్ రామారావు దర్శకత్వంలో వచ్చిన తాతమ్మకల సినిమాలో బాలకృష్ణ బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్ చిత్రాల్లో ఆయన కొడుకుగా, స్నేహితునిగా నటించడం ప్రారంభించారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌తో కే.రాఘవేంద్రరావు ఓ చిత్రాన్ని నిర్మించారు.
1980 రామకృష్ణ సినీ స్టూడియోస్, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రౌడీ రాముడు కొంటె కృష్ణుడు సినిమా విడుదల అయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, శ్రీదేవి, బాలకృష్ణ, రాజ్యలక్ష్మి కలిసి నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.
ఇక ఆ తరువాత బాలకృష్ణ సోలో హీరోగా 1985 రామకృష్ణ సిని స్టూడియోస్ కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో పట్టాభిషేకం చిత్రం విడుదల అయింది. ఈ చిత్రంలో బాలకృష్ణ, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. పరుచూరి బ్రదర్స్ కథ అందించగా.. చక్రవర్తి బాణిలు సమకూర్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.
Advertisement
1986లో కే.రాఘవేంద్రరావు సోదరుడు కె.కృష్ణమోహన్ రావు నిర్మాతగా, కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అపూర్వ సహోదరులు చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ, విజయశాంతి, భానుప్రియ కలిసి నటించారు. బాలయ్య ఇందులో తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
1987 కే.సీ. శేఖర్ బాబు నిర్మాణం, కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాహస సామ్రాట్ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో బాలకృష్ణ, విజయశాంతి కలిసి నటించారు. ఎన్నో వివాదాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీలా పడింది.
1988 గోపి ఆర్ట్ పిక్చర్స్ కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో దొంగరాముడు చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ, రాధ, హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నిర్మాతలు బాలకృష్ణ-రాఘవేంద్రరావు కాంబో అంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో భారీ చిత్రాల నిర్మాత అశ్వనిదత్ ఆ విషయాలన్నింటిని పక్కకు వదిలేసి రాఘవేంద్రరావు, బాలకృష్ణ కలయికలో ఒక సినిమా రూపొందించాలనుకున్నారు.
1992లో అశ్వనిదత్ నిర్మాతగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వమేధం సినిమా విడుదల అయింది. ఈ చిత్రంలో బాలకృష్ణ, నగ్మా, మీనా హీరో, హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరోగమనం పటింది. దాదాపు 15 సంవత్సరాల తరువాత వీరి కాంబోలో చివరి చిత్రం పాండురంగడు 2008లో వచ్చింది. ఈ చిత్రంలో బాలకృష్ణ, స్నేహ, టబు హీరో హీరోయిన్లుగా నటించారు. భక్తిరస చిత్రం అయినప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. రాఘవేంద్రరావు – బాలకృష్ణ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం గమనార్హం. ఎందుకు ఇలా అయిందని పలువురు సోషల్ మీడియాలో చర్చలు కూడా మొదలు పెట్టారు.