సాధారణంగా ఎవ్వరైనా ప్రేమలో పడటం సహజమే. కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవడం చాలా కష్టం. కొందరూ చీటికి మాటికి గొడవలు పడుతుంటారు. మరికొందరూ చిన్న విషయాలకు కూడా బ్రేక్ అప్ చెబుతుంటారు. ఈ రోజుల్లో లవర్ టైమ్ కి రాకపోయినా.. అడిగింది ఇవ్వకపోయినా, కలిసి టైమ్ స్పెండ్ చేయకపోయినా బ్రేక్ అప్ చెప్పేసుకుంటున్నారు. బ్రేక్ అప్ కి అనేక కారణాలుంటాయి. మనస్తత్వవేత్తలు, రిలేషన్ ఎక్స్ పర్ట్ ప్రకారం.. బ్రేక్ అప్ లో అవ్వడానికి కొన్ని సాధారణ కారణాలున్నాయి. ప్రేమికులను విడదీసే.. 5 కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
వగా విడిపోవడానికి ప్రధాన కారణం.. ఇద్దరి లవర్స్ మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే వారి మధ్య అపార్థాలు, విభేదాలు పరిష్కారం అవ్వవు. భావోద్వేగ దూరానికి దారి తీస్తుంది. కాల క్రమేణా వారి మధ్య విశ్వాసం, పునాది, సాన్నిహిత్యం విచ్ఛిన్నమైన విడిపోయే అవకాశముంది. ప్రేమికులు సరిగ్గా మాట్లాడుకోకపోతే వారి మధ్య నమ్మకం, సాన్నిహిత్యం పూర్తిగా నాశనమవుతుంది. భావాలను వ్యక్తపరిచకపోవడం, భావోద్వేగాలను అదుపుచేయడం స్పష్టత లేకపోవడం వల్ల తరుచూగా గొడవపడుతుంటారు. బ్రేక్ అప్ కి కారణమవుతుంది. బంధం బలంగా ఉండటానికి శారీరక, మానసిక ఇంటిమసి చాలా ముఖ్యమైంది. కపుల్స్ మధ్య.. ఫిజికల్ ఇంటి మసీ, మానసిక సాన్నిహిత్యం క్షీణించినప్పుడు వారి మధ్య బంధం బీటలు వారుతుంది. కపుల్స్ మధ్య ఇంటిమసీ లేకపోతే.. ఎమోషనల్ దూరాన్ని సృష్టిస్తుంది. బ్రేక్ అప్ కు కారణం అవుతుంది.
Advertisement
కంపాటబిలిటీ అనగా.. ఇద్దరి ఆసక్తులు, లక్ష్యాలు, విలువలు, జీవనశైలి ఒకేవిధంగా ఉండటం.. లవర్స్ మధ్యలో కంపాటబిలిటీ లేకపోతే.. వారి మధ్య దూరం పెరుగుతుంది. ఇది వారి మధ్య సంబంధాన్ని గందరగోళంగా మారుస్తుంది. ఇన్ కంపాటబిలిటీ కారణంగా బ్రేక్ అప్ అయ్యే అవకాశముంది. మరికొందరూ మానసికంగా డిస్ కనెక్ట్ అయినట్టు భావిస్తారు. కాలక్రమేణా ఇది ఒంటరితనం, భావోద్వేగ అసంతృప్తి, భావోద్వేగ అవసరాలను తీర్చడం లేదనే భావనకు దారి తీస్తుంది. భావోద్వేగ అవసరాలు తీరనప్పుడు బ్రేకప్ అయ్యే అవకాశముంది. ఏదైనా బంధం బలంగా ఉండాలంటే.. నమ్మకం మూల స్థంభం. ప్రేమికులకు ఒకరిపై ఒకరి నమ్మకం లేకపోతే.. వారి మధ్య బంధం విచ్ఛిన్నం అవుతుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
- ఎడమవైపు పడుకునే వ్యక్తులకు ఏమి జరుగుతుంది…ఆ ప్రమాదం తప్పదా !
- వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూస్తే ఇక అంతే సంగతులు…!