రోమియో జూలియట్, సలీం అనార్కలీ, పార్వతి దేవదాస్, లైలా మజ్క్షు ఇలా ఎన్నోజంటలు అమర ప్రేమికుల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. అమర ప్రేమికులు అనే అంశం గుర్తుకు వస్తే చాలు. ఈ జంటల పేర్లే గుర్తుకు వస్తాయి. చరిత్రకారులు, కవులు, వీరి ప్రేమ కథలను కృత్యంగా వర్ణించడంతో నేటికి వారి పేర్లు తలుస్తూనే ఉంటాం. కొన్ని ఘటనలు మాత్రం మన కళ్ల ముందే సరైన ప్రాచుర్యం లేక చరిత్ర శిథిలాల కింద మసకబారిపోతూనే ఉన్నాయి. చరిత్రకారుల చిన్న చూపు కవుల కలంకు కానరాలేదేమో కానీ, అనంతపురం జిల్లా కదిరిలో చోటు చేసుకున్న ఓ యథార్థ గాథ చీకట్లోనే మగ్గుతుంది. ఇష్టపడిన వారి కోసం ప్రాణాలు అర్పించిన దురదృష్టవశాత్తు ఈ ఘటన వారి సమాధితోనే ముగిసింది.
Also Read : శ్రీముఖి ప్రేమలో పడిందా..? ఫొటో వైరల్..!
Advertisement
శతాబ్దాల క్రితం కదిరి నరసింహా దేవాలయంలో కార్తికమాసం ఉత్సవాలు జరుగుతున్న రోజుల్లో ఒకరోజు వేకువజామున పట్టు వస్త్రాలతో స్వామివారి దర్శనానికి ఓ యువతి ఆలయ ప్రాంగణానికి వచ్చింది. అదే సమయంలో ఓ యువకుడి కళ్లు ఆమెను కమ్మెస్తున్నాయి. చూపు తిప్పుకోనివ్వలేనంత లావణ్యం ఆమెది. ఇంకేముంది ఒక్కసారిగా తొలిప్రేమ పుట్టింది. ఆ అమ్మాయి అప్పటి పట్ణణం పాలేగాళ్ల గారాల పట్టి చంద్రవదన. పేరుకు తగ్గట్టే అందాల రాశి. ఆ యువకుడు పర్షియా దేవస్థుడు అదే ఇప్పటి ఇరాన్ దేశం. అక్కడి నుంచి వజ్రాల వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చాడు. అతని పేరు మోహియార్. చంద్రవదనను చూసినప్పటి నుంచి ఆమె ఎక్కడికి వెళ్లితే అక్కడికి వెళ్లడం పనిగా పెట్టుకున్నాడు మోహియార్. తన వెంట మోహియార్ తిరగడం చూసి చంద్రవదన కూడా అతని ప్రేమలో పడింది. ఎన్నోసార్లు కలవాలని చూసినా విఫలమయ్యాడు.
Advertisement
కొన్ని సందర్భాలలో స్నేహితుల ద్వారా సందేహాలు పంపుకునేవారు. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకునేవారు. ఇక ఆలస్యం చేయకూడదని, తన ప్రేమను పెద్దల ముందు మోహ్యర్ బహిర్గతం చేశారు. అయితే శతాబ్దాల క్రితం మాట కాబట్టి కట్టుబాట్లు అత్యంత కఠినంగా ఉండేవి. దీంతో యధావిధిగా వారి ప్రేమ తిరస్కరణకు గురైంది. తమ ఇంటి ఆడపడుచూ వేరే దేశానికి చెందిన వ్యక్తికి ఇవ్వడం ఇష్టం లేక కనీసం ఆమెను బయటికి కూడా రాకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు పట్టణం పాలేగాళ్లు. దీంతో ఒకరిని ఒకరు చూడకుండా ఉండలేకపోయేవారు. ఒకరి కోసం ఒకరు నిద్రహారాలు మానేసి సంవత్సరం పూర్తి అయింది. ఫలితంగా ఆరోగ్యం క్షీణించి ఆమె కోసం పరితపించిన మోహ్యర్ తనువు చాలించాడు. ఇది తెలిసిన చంద్ర వదన కూడా మోహియార్ మీద ఉన్న ప్రేమతో శ్వాస విడిచింది.
దీంతో ఈ వార్త దావనంలా వ్యాపించి కదిరి ప్రాంతమంతా శ్లోక సంద్రంలో మునిగిపోయింది. భౌతికంగా కలవలేకపోయిన వారిద్దరినీ కనీసం సమాదులైన ఒకే చోట ఏర్పాటు చేయాలన్న కలంపుతో కదిరి ప్రాంతంలోని కపట స్థానంలో ఇద్దరి మృత దేహాలను కప్పించారు. అనంతరం వారి ప్రేమ భావితరాలకు అందించాలన్న సదుద్దేశంతో వారి సమాధులను నిర్మించారు. ఎంతో మంది యువతి, యువకులను వీరి సమాధులను దర్శించుకుంటారు. ఈ సమాధుల వద్ద ఉన్న మట్టిని తాకితే తమ ప్రేమ ఫలిస్తుందనే నమ్మకం ఉంది. ఎంతో మంది సమాధులను దర్శించి మట్టిని తాకిన తరువాత ప్రేమ సఫలమయ్యామని కథలో కూడా ఉన్నాయి. కాలగర్భంలో ఈ చరిత్ర కలిసిపోతుంది. రాను రాను సందర్శకుల తాకిడి కూడా తగ్గిపోయింది. ఈ ప్రాంతంలో అనేక మంది తమ పిల్లలకు చంద్ర మోహియార్ అనే పేర్లను పెట్టుకుని అమర ప్రేమికులను ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు. చాలా మందికి తెలియని 500 ఏళ్ల చరిత్ర కలిగిన కదిరికి సంబంధించిన ప్రేమ కథ ఇది.
Also Read : శ్రీముఖి ప్రేమలో పడిందా..? ఫొటో వైరల్..!