Home » బింబిసార 2 సినిమా క‌థ ఇదే.. ద‌ర్శ‌కుడు వ‌శిష్ట రాజ‌మౌళిని ఫాలో అయ్యారా..?

బింబిసార 2 సినిమా క‌థ ఇదే.. ద‌ర్శ‌కుడు వ‌శిష్ట రాజ‌మౌళిని ఫాలో అయ్యారా..?

by Anji
Ad

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన బింబిసార సినిమా ఇటీవ‌లే విడుద‌లై అంచనాల‌కు మంచి అద్భుత‌మైన స‌క్సెస్ సాధించిన విష‌యం విధితమే. క‌ళ్యాణ్ రామ్ హీరోగా వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి పాజిటివ్ గా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ బాల గోపాలాన్ని అల‌రించేవిధంగా బింబిసార ఉన్న‌ద‌ని నెటిజ‌న్ల నుంచి కామెంట్లు వ్య‌క్తం అవుతున్నాయి. బింబిసార ద‌ర్శ‌కుడు వ‌శిష్ట క‌ళ్యాణ్ రామ్ బింబిసార 2 క‌థ గురించి ఓ హింట్ కూడా ఇచ్చారు.

Advertisement

ఇక బింబిసార సినిమాలో రాజు బింబిసార గురించి ఎక్కువ‌గా స‌న్నివేశాలు లేవు. బింబిసార రాజ్యాల‌ను ఆక్ర‌మించుకున్నాడ‌ని చూపించిన‌ప్ప‌టికీ ఆ స‌న్నివేశాల‌ను తెర‌పై చూపించ‌లేదు. అయితే బింబిసార 2 లో ఆ స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు చూపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ద‌ర్శ‌కుడు వ‌శిష్ట‌, క‌ళ్యాణ్ రామ్ ఈ ఆస‌క్తి క‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. మ‌రోవైపు బ‌డ్జెట్ విష‌యంలో మాత్రం ఎలాంటి రాజీ ప‌డ‌కుండా బింబిసార 2 తెర‌కెక్కిస్తామ‌ని క‌ళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. బింబిసార అంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందని వెల్ల‌డించారు క‌ళ్యాణ్ రామ్‌.

Advertisement

ద‌ర్శ‌కుడు వ‌శిష్ట ప్రేక్ష‌కుల‌కు బోరు కొట్ట‌కుండా సినిమాల‌ను తెర‌కెక్కించ‌డం కూడా సినిమాల విజ‌యం సాధించ‌డానికి ఒక కార‌ణం అనే చెప్ప‌వ‌చ్చు. ద‌ర్శ‌కుడు ఈ సినిమా విష‌యంలో ఒక విధంగా బాహుబ‌లి 2 సినిమాను ఫాలో అయ్యార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. బాహుబ‌లి లో అమ‌రేంద్ర బాహుబ‌లికి సంబంధించిన స‌న్నివేశాల‌ను ఎక్కువ‌గా చూపించ‌లేదు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. ద‌ర్శ‌కుడు వ‌శిష్ట కూడా బింబిసార 2 విష‌యంలో ఇదే లాజిక్‌ను ఫాలో అవుతున్నార‌ని కామెంట్లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బింబిసార 2 సినిమాలోనే ద‌ర్శ‌కుడు అస‌లు క‌థ‌ను చూపించ‌నున్నార‌ని వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి. బింబిసార 2 సినిమాతో క‌ళ్యాణ్ రామ్ ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చేరుతుందేమో చూడాలి.

Also Read : 

ద‌ర్శ‌కుడు విఠలాచార్య వ‌చ్చి అడిగినా ఎన్టీఆర్ మాత్రం సినిమా చేయ‌డానికి ఒప్పుకోలేద‌ట‌.. ఎందుకో తెలుసా..?

దర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ప‌రిచ‌యం చేసిన అంద‌మైన హీరోయిన్లు వీరే..!

Visitors Are Also Reading