మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ లో నటించిన మూవీ టైగర్ నాగేశ్వర్ రావు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో రవితేజ పర్ఫామెన్స్ ఆకట్టుకున్నప్పటికీ సినిమా లెంత్ 3 గంటలకు పైగా ఉండటం.. ఫస్ట్ హాప్ లో లవ్ ట్రాక్ అనవసరమనిపించడంతో ఆడియన్స్ కి ఈ చిత్రం యాక్సెప్ట్ చేయలేకపోయారు.
Advertisement
కానీ కథ, కథనాల్లో లోపాలకు తోడు థియేటర్స్ కూడా ఆశించిన స్థాయిలో దక్కకపోవడంతో టైగర్ నాగేశ్వర్ రావు వసూళ్ల పరంగా వెనుకపడింది. ఈ సినిమా రిజల్ట్స్ చూసి రియలైజ్ అయిన చిత్ర యూనిట్ డ్యూరేషన్ తగ్గించి 2 గంటల 37 నిమిషాలకు కుదించింది. డ్యూరేషన్ తగ్గించిన తరువాత కలెక్షన్ల పరంగా టైగర్ మెల్లగా పుంజుకుంటోంది. రవితేజ అభిమానులతో సహా మాస్ ఆడియెన్స్ కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. డ్యూరేషన్ తగ్గించిన తరువాత సినిమాకి క్రిస్పిగా అనిపించడంతో ప్రేక్షకుడు ఎంగేజ్ అవుతున్నాడు.
Advertisement
దసరా మూవీ తరువాత రోజు నుంచి కలెక్షన్లు ఇంప్రూవ్ అయ్యాయని ట్రేడ్ వర్గా నుంచి సమాచారం. ఫస్ట్ వీకెండ్ తరువాత లియో మూవీ కలెక్షన్లు డ్రాప్ అవ్వడం కూడా టైగర్ నాగేశ్వరరావు సినిమాకి ప్లస్ అయిందనే చెప్పాలి. ఇదే డ్యూరేషన్ తొలుత నుంచి ఉండి ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేదని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఓవైపు భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని ఇప్పటికే రూ.100కోట్లు పైగా వసూలు చేసి దూసుకుపోతుండగా.. లేట్ గా స్పీడ్ పెంచిన టైగర్ నాగేశ్వరరావు సినిమా సేఫ్ జోన్ కి చేరుతుందో లేదో చూడాలని మరీ.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.