ప్రస్తుతం యూట్యూబ్ అందుబాటులోకి వచ్చిన తరువాతచిన్న, పెద్ద తేడా లేకుండా ఎందరో దర్శక, నిర్మాతలు, నటీనటులు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడుఆడియన్స్‌తో టచ్‌లో ఉండేందుకు ఇది వారికి వరం మాదిరిగా మారింది. ఈ తరుణంలోనే తాజాగాలో తెలుగులో రెండు, మూడు సినిమాలు చేసిన దర్శకుడు దర్శకుడు గీతా కృష్ణ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చి హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
అవకాశాల పేరుతో మహిళలను లైంగికంగా దోచుకుంటున్నాపెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచాయి. ఇక గీతాకృష్ణ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అప్పుడు, ఇప్పుడు అని కాదు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పుడు ఉందని.. అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ ప్లేస్ కాదని ఆయన చెప్పడం హాట్ టాఫిక్ అయింది. సంకీర్తన సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన గీతా కృష్ణ ఆ తరువాత కీచురాళ్లు, కోకిల వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు ప్రకటించారు.
Advertisement
Advertisement
మీరు సినిమాలు తీసినప్పటి నుంచి ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో ఏమైనా మార్పులు కనిపించాయా.? ఇ యాంకర్ ప్రశ్నించగా.. హీరోయిన్ల మ్యాటర్ తీస్తూ అప్పుడైనా, ఇప్పుడైనా పడుకోవాల్సిందే అని వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. ఇది సినీ పరిశ్రమలో పాతుకుపోయిందన్నారు. రేణుదేశాయ్‌కి ఇలాంటి ఇబ్బందులు తప్పలేదని గీతాకృష్ణ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఇక సింగర్స్ విషయంలోనూ ఇదే జరుగుతుందని.. ఇక ఇలాంటి విషయాలు బయటపెడితే ఆపర్లు ఇవ్వరని ఆయన చెప్పారు. కేవలం క్యాస్ట్రింగ్ కౌచ్ ఒక్కటే కాదని.. ఇండస్ట్రీలో హాని ట్రాప్ కూడా ఉందని గీతాకృష్ణ పేర్కొన్నారు. గీతాకృష్ణ చేసిన ఈ కామెంట్స్ పలు చర్చలకు తావిచ్చాయి.
Also Read :
ప్రముఖ విలన్ రఘువరన్ కొడుకు.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే.. చూస్తే షాకవుతారు..?
అర్జున్ టెండూల్కర్ ను ఆ ముంబై పట్టించుకోలేదు.. ఈ ముంబై పట్టించుకోలేదు..!