Home » హీరోగా అల్లు అర్జున్ పనికిరాడని ఆ బ్యానర్ రిజెక్ట్ చేసిందా ?

హీరోగా అల్లు అర్జున్ పనికిరాడని ఆ బ్యానర్ రిజెక్ట్ చేసిందా ?

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. గంగోత్రి నుంచి పుష్ప వరకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఐకాన్ స్టార్ గా మారారు. డిఫరెంట్ స్టైల్ లో యాక్టింగ్ చేసే హీరో అల్లు అర్జున్. ఆయన యాక్టింగ్ ని మెచ్చి పుష్ప సినిమాకి  నేషనల్ అవార్డు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.  అలాంటి అల్లు అర్జున్ గంగోత్రి సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. అయితే  సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు  అల్లు అర్జున్ ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారట. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

అల్లు అర్జున్ తో  సినిమా కోసం ఓ ప్రముఖ బ్యానర్ లో ఆఫర్ వచ్చిందని, కానీ వారు నన్ను చూసి బాలేనని ఆ సినిమా నుంచి తప్పించారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అల్లు అర్జున్.  ఆ సమయంలో నాన్న, చిరంజీవి మామయ్య చాలా బాధపడ్డారని, ఇదే సమయంలో వాళ్లు ఆలోచన చేసి సొంతంగా సినిమా చేయాలని  ప్లాన్ చేశారు. ఇదే సమయంలో గంగోత్రి సినిమా ప్రపోజల్ వచ్చిందని.. ఈ సినిమా అందరినీ ఆకట్టుకున్నప్పటికీ..  నటుడిగా తాను ఫెయిల్ అయ్యానని బన్నీ చెప్పారు.  ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నా ఫేస్ ను మెచ్చలేదని, నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో నాన్న కూడా సినిమాలు తీయలేని పరిస్థితిలో ఉన్నారు.

Advertisement

 నన్ను నటనపరంగా నమ్మే వాళ్ళు లేరు..  కానీ ఇదే సమయంలో దిల్ రాజ్ కొత్త వాళ్లతో ఆర్య సినిమా తీస్తున్నానని చెప్పడంతో అందులో ఆఫర్ వచ్చిందని ఎలాగోలా ఆ సినిమా పూర్తి చేశానని.. ఈ మూవీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని బన్నీ చెప్పుకొచ్చారు. ఈ విధంగా బన్నీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే బెస్ట్ యాక్టర్ గా అవార్డు తీసుకోవడం ఆయనకు ఆనందం కలిగించిందని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Chanikya niti : పురుషులలో ఉండే ఈ 4 అలవాట్లే వారి పతనానికి కారణం అవుతాయి.!

శ్రీలీలకు హీరో యశ్ బావ అవుతారనే విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading