తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కడ చూసినా సంగీత దర్శకుడు థమన్ పేరు మారుమ్రోగుతుంది. నిన్న మొన్నటి వరకు కాపీ దర్శకునిగా పేరుపొందిన థమన్ ప్రస్తుతం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఎవ్వరూ ఊహించని విధంగా సంగీతం అందిస్తూ సినిమా సినిమాకు వైవిద్యం కనబరుస్తున్నాడు. థమన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ పేరు వింటే చాలు.. హీరోకి తన స్టైల్‌లో ఎలివేషన్స్ ఇస్తుంటాడు. అందుకు తగ్గట్టు మ్యూజిక్ తయారు చేయించుకుంటారు. ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాకి థమన్ సంగీతం అందించారు. బోయపాటి-థమన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
అఖండ సినిమాకి బోయపాటి ఎలివేషన్స్ ఎంత ప్లస్ అయ్యాయో మ్యూజిక్ కూడా అంత ప్లస్ అయిందని చెప్పవచ్చు. బ్యాగ్రౌండ్ స్కోరింగ్ అద్భుతంగా రాబట్టాడు థమన్. ఈ తరుణంలో థమన్ ప్రస్తుతం టాప్ మ్యూజిక్ దర్శకుని హోదా అందుకున్నాడు. అంతే రేంజ్‌లో అవకాశాలు కూడా కొల్లగొడుతున్నాడు. రవితేజ నటించిన కిక్ సినిమాతో తొలిసారి సంగీత దర్శకుడిగా మారిన థమన్ ఆ తరువాత రోజుల్లో అంచెలంచెలుగా ఎదిగాడు. అప్పట్లో దేవిశ్రీప్రసాద్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రస్తుతం థమన్ కూడా అదే రేంజ్ సక్సెస్‌ని అందుకున్నాడు.
Advertisement
Advertisement
Also Read : ‘స్టూడెంట్ నెం 1’ నుంచి ‘RRR’ వరకు రాజమౌళి సినిమాల కలెక్షన్స్
బ్యాండ్‌కి మరోపేరు తెచ్చుకున్న థమన్.. తన సినిమాల్లో వైవిద్యంగా సంగీతాన్ని అందిస్తున్నాడు. రీసెంట్‌గా మెగాస్టార్ నటించిన లూసిఫర్‌కి థమన్ అందించిన మ్యూజిక్ చాలా బాగుందని టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా బోయపాటి త్వరలో రామ్ పోతినేనితో ఓ సినిమా చేయనున్నాడు. అందుకు థమన్ మ్యూజిక్ కూడా అందిస్తున్నాడట. ఇందుకోసం ఏకంగా రూ.4కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇదే వాస్తవమైతే థమన్ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమాగా నిలువనుంది. ప్రస్తుతం థమన్ త్రివిక్రమ్- మహేశ్ బాబు మూవీతో పలు తమిళ సినిమాలకు సంగీతం అందించనున్నారు.
Also Read : చిరంజీవి గురించి ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ ఏమన్నారో తెలుసా..?