Home » సమంత నాగచైతన్య కంటే ముందు ఆ స్టార్ హీరోనే పెళ్లి చేసుకోవాలనుకుందా..?

సమంత నాగచైతన్య కంటే ముందు ఆ స్టార్ హీరోనే పెళ్లి చేసుకోవాలనుకుందా..?

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది హీరో, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాంటి వారిలో అక్కినేని నాగచైతన్య, సమంత జంట కూడా ఒకటి. వీరిద్దరూ కలిసి ఏంమాయ చేసావే మూవీలో కలిసి నటించారు. ఇక అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ ప్రేమ కాస్త పెళ్లి వరకు దారి తీసింది. వీరిద్దరూ ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీలోనే చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకుంది ఈ జంట. అలాంటి ఈ జంట పెళ్లి పెటాకులు అయిందనే చెప్పాలి. 

Advertisement

 

నాగచైతన్య, సమంత పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే మారి.. మనస్పార్థాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎవ్వరి కెరీర్ వారు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే సమంత నాగచైతన్య కంటే ముందు మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుందట. సమంతని పెళ్లికి ముందే ఓ స్టార్ హీరో ప్రేమించాడు. అతను మరెవ్వరో కాదు.. బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా,  బొమ్మరిల్లు వంటి సూపర్ హిట్  సినిమాల  ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సిద్దార్థ.  బొమ్మరిల్లు తరువాత సిద్దార్థకి ఏ సినిమా కూడా అంతగా గుర్తింపు రాలేదనే చెప్పవచ్చు. 

Advertisement

 

సమంత, సిద్దార్థ అప్పట్లో గాఢమైన ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలిసి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. ఇద్దరు కలిసి గుళ్లు, గోపురాలు తిరగడం లొకేషన్స్ కి వెళ్లడం వంటి ఫొటోలు సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ గా మారాయి. అలా వీరు కొన్నాళ్లు గెలిచిన తరువాత సమంత నాగచైతన్యకి చాలా దగ్గర అయింది. దీంతో సిద్దార్థ్ ఆమెకు దూరమవుతూ వచ్చాడు. అలా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుని విడిపోయారట. ఈ నేపథ్యంలోనే చాలా మంది నెటిజన్లు నాగచైతన్యతో సమంత లైఫ్ ఏం బాగుంది..? సిద్ధార్థను పెళ్లి చేసుకున్నా కలిసి ఉండే వారేమో అంటూ కామెంట్స్ చేశారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఒకప్పటి నటి “సంఘవి” గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూడండి.. వైరల్ అవుతున్న ఫొటోస్!

జబర్దస్త్ వేణు ప్రేమించిన అమ్మాయిని మోసం చేసారా? తిట్టిపోస్తున్న నెటిజన్స్.. అసలేం జరిగిందంటే?

Visitors Are Also Reading