జక్కన్న తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలను నిర్మించి దేశంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక మంచి పేరు తీసుకువచ్చిన డైరెక్టర్ అని చెప్పవచ్చు. ఇండియా లెవెల్ లో ఒక కోణంలో చూసుకుంటే రాజమౌళిని ఎదుర్కొని తీసే కంటెంటు వేరే వారికి లేదని కొంతమంది అంటుంటారు.
Advertisement
తెలుగు సినిమాని సరిహద్దులు దాటించిన మొదటి వ్యక్తి జక్కన్న. ఇప్పటికే బాహుబలి లాంటి సినిమాలు తీసి ఘనత సాధించిన ఆయన, మళ్లీ దాన్ని మించిన రేంజ్ లో త్రిబుల్ ఆర్ సినిమా తీశారు. వీటికంటే ముందు ఈగ, మగధీర ఇలాంటి సినిమాలు తీయడంతో ఎంతోమంది ఆయన ప్రతిభకు నీరాజనాలు పలికారు. ఇందులో ముఖ్యంగా ఈగ సినిమా బాలీవుడ్లో కూడా అందరి నోళ్ళల్లో నాని ప్రతి ఒక్కరు రాజమౌళి వైపు చూసేలా చేశాడు. మరి రాజమౌళి ఈగ సినిమా ఎందుకు తీశారు.. దాని వెనుక నిజమైన చరిత్ర ఒకటి దాగి ఉంది..?
Advertisement
అయితే రాజమౌళి మగధీర సినిమాను ఎంత బడ్జెట్ పెట్టి తీశారు. తెలుగులో విజయవంతం అయిన వెంటనే బాలీవుడ్ మరియు తమిళ్ లో కూడా రిలీజ్ చేయాలని అల్లు అరవింద్ ముందే చెప్పారట.. అలాగే 50 రోజులు మరియు వందరోజుల సెంటర్ల వివరాలను వెల్లడించ కూడదని… వాటి యొక్క కలెక్షన్లు కూడా బయట చెప్పవద్దని కండిషన్ తో ఈ సినిమా మొదలుపెట్టారట రాజమౌళి. దీన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ చేసాడు. కానీ జక్కన్న ఆశలను అరవిందు అడియాశలు చేసేసారు.. తెలుగులో విజయవంతమైన సంవత్సరానికి కానీ ఇతర భాషల్లో రిలీజ్ చేయలేదు. అప్పటికి ఈ
మూవీని మిగిలిన భాషల్లో ఉన్న ప్రేక్షకులు చూసేయడంతో దాని రేంజ్ తగ్గిపోయింది. దీంతో రాజమౌళికి పాన్ ఇండియా లెవెల్ సినిమా తీయడానికి పదేళ్ళు పట్టింది. అరవింద్ పై కోపానికి ఇది ఓ కారణం కాగా, అరవింద్ మాట తప్పిన తర్వాత వందరోజుల సెంటర్ లతో పాటుగా కలెక్షన్ల వివరాలను కూడా పదే పదే చెప్పేశారట దీంతో రాజమౌళి కోపం వచ్చింది. ఈ విషయాన్ని రాజమౌళి కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పి అరవింద్ పై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత స్టార్స్ లేకుండా సినిమాలు తీసి హిట్ కొట్టాలి అనుకున్నాడు రాజమౌళి. అదే చాలెంజ్ తో ఈగ మూవీ తీసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి చూపించాడు.
ALSO READ:
ఇజ్రాయిల్ లో కాశ్మీరీ ఫైల్స్ పోస్టర్ విడుదల.. అక్కడ సినిమా పేరు ఏంటంటే..!!
KGF లో రాఖీబాయ్ తల్లి పాత్ర చేసిన అమ్మాయి వయసు ఎంతో తెలిస్తే షాకే..!!