ఒకప్పుడు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిచయమైన హీరో ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమాలో ప్రభాస్ కథనాయకుడిగా నటించాడు. ఇక అప్పటి నుంచి ప్రభాస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. నటనతో పాటు అందం, అభినయం, రాజసం, ఆకృతి అన్నీ కలిసిన హీరో ప్రభాస్ కటౌట్ చూస్తే ఎంతటి అభిమాని అయినా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సందర్భంలోనే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో రామాయణ నేపథ్య కథతో తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్.
ప్రభాస్ ఈ చిత్రంలో రాముడి పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన సీతమ్మ పాత్రలో కృసనన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమాను గతంలో ఆగస్టు 11న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. మరోవైపు అదే రోజు అమీర్‌ఖాన్ లాల్‌సింగ్ చడ్డా సినిమాని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో అమీర్ ఖాన్ , వారి చిత్ర బృందం కలిసి ఆదిపురుష్ చిత్ర యూనిట్‌తో సంప్రదింపులు జరిపి ఈ సినిమాని వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం.
Advertisement
Advertisement
ఇక ఇదే సందర్భంలోనే ఆదిపురుష్ మూవీ యూనిట్ లాల్ సింగ్ చడ్డా మూవీని ఆగస్టు 11వ తేదీ రోజు విడుదల చేయడం కోసం పోస్ట్ పోస్ చేశారని.. ఇందుకోసం హీరో ప్రభాస్ కూడా విడుదల తేదీని త్యాగం చేసినప్పటికీ అమీర్ ఖాన్ మాత్రం ఎలాంటి విజయాన్ని అందుకోలేదు. దీంతో ప్రభాస్ చేసిన త్యాగం వృధాగా మారిందని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ సినిమా మరింత ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని రూ.500 కోట్ల వ్యయంతో తెరకెక్కించారట. ప్రభాస్ బాహుబలి తరువాత అత్యంత భారీ బడ్జెట్ సినిమా అయినటువంటి ఆదిపురుష్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంద వేచి చూడాలి మరి.
Also Read :
పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడా..? కారణం ఏమిటంటే..?
లలిత జ్యూవెలరీ అసలు ఓనర్ కిరణ్ కుమార్ కాదంట.. ఎవరంటే..?