Home » పవన్ కళ్యాణ్ కాలేజీలో ఉండగానే ప్రేమలో పడ్డాడా..? ఆయన ప్రియురాలు ఎవరో తెలుసా ?

పవన్ కళ్యాణ్ కాలేజీలో ఉండగానే ప్రేమలో పడ్డాడా..? ఆయన ప్రియురాలు ఎవరో తెలుసా ?

by Anji
Ad

సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అంటే ఓ క్రేజ్ అనే చెప్పాలి. ఇక ఆయన సినిమాల విడుదలవుతుందంటే హిట్ ఫ్లాప్ పక్కకు పెడితే ఫ్యాన్స్ పండుగ అనే చెప్పాలి. ఓవైపు సినిమాలు తీస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నాడు పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించి పలు విషయాలు హల్ చల్  సృష్టిస్తున్నాయి. తాజాగా పవర్ స్టార్ కాలేజీ రోజుల్లో జరిగిన సంఘటన హాట్ టాఫిక్ గా మారింది.  

pawan-kalyan-wife-images

Advertisement

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడు వంటి సినిమాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఖుషి సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి అండతో ఇండస్ట్రీకి వచ్చిన పవన్ కళ్యాణ్ సొంత ఇమేజ్ ని ఏర్పాటు చేసుకొని సినిమాల్లో మంచి సక్సెస్ జీవితం కొనసాగిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అందుకు ముందే పవన్ నందిని వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమెతో విడాకులు తీసుకొని రేణు దేశాయ్ ని పెళ్లాడాడు. ఆ తరువాత మనస్పార్థాల కారణంగా ఆమెకు కూడా విడాకులు ఇచ్చాడు.

Advertisement

 

ప్రస్తుతం రష్యాకి చెందిన లెనెవా ని పెళ్లి చేసుకున్నాడు. అయితే పవన్ కళాశాలలో చదువుకున్నప్పుడే ఓ అందమైన అమ్మాయి ఉండేదట. ఆమెను అందరూ ఇష్టపడ్డారట. కానీ ఆమె మాత్రంపవన్ వైపు ఎక్కువగా చూసేదట. దీంతో పవన్ స్నేహితులు ఆమె తనను ప్రేమిస్తుందని చెప్పారట. వెంటనే ప్రపోజ్ చేయాలి ఫోర్స్ చేశారట. దీంతో పవన్ తన వద్ద ఉన్న పాత కారును రిపేరు చేసుకొని మరీ ఆమెను కారులో ఎక్కించుకొని కొంతదూరం వెళ్లిన తరువాత ప్రపోజ్ చేసినట్టు సమాచారం. పవన్ ని ఎడాపెడా తిట్టి.. నీ వయస్సు ఏంటి ? నీ మాటలు ఏంటి ? అని చెప్పి వెళ్లి పోయిందని కొందరూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 

Visitors Are Also Reading