కేవలం మూడో తరగతి చదువుకున్న నిర్మలమ్మ తన జీవితంలో మాత్రం మంచి పేరును తెచ్చుకుంది. బామ్మ, అమ్మ, పాత్రలు అంటే అప్పట్లో నిర్మలమ్మను మించిన వారు ఎవ్వరు లేరు. ఆమె మాటే పాలిట వరంగా మారింది. ఇండస్ట్రీలో మోహన్ బాబు, చిరంజీవి, రాజశేఖర్ అగ్ర హీరోలందరికీ అమ్మగా.. అమ్మమ్మగా, నాయనమ్మగా నటించిన తీరు అందరినీ ఆకర్షించేది. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఈ నిర్మలమ్మ తమ చివరి రోజుల్లో మాత్రం చాలా దారుణంగా చీమలు పట్టి ఎవ్వరూ కూడా చూడలేని పరిస్థితుల్లో చనిపోయింది. ఎందుకు అలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శోభన్ బాబు, కృష్ణకి అమ్మగా నటించింది. అంతేకాదు.. నిర్మలమ్మ సెట్ లో ఉండే వారందరికీ స్వయంగా తానే ఆహారం వండుకొని తీసుకొచ్చేదట. కేవలం సినిమాల్లోనే అమ్మగా ఉండకుండా బయట కూడా చాలా మందితో అమ్మా అని కడుపారా పిలిపించుకునేదట. అలా కోట్లాది రూపాయలు సంపాదించిన నిర్మలమ్మ చాలా సింపుల్ గా ఉండేదట. నిర్మలమ్మ కృష్ణారావు దంపతులకు సంతానం లేకపోవడంతో కవిత అనే అమ్మాయిని పెంచుకున్నారట. తన కూతురును గ్రాండ్ గా పెళ్లి చేసి చెన్నైకి పంపించారు.
Advertisement
నిర్మలమ్మ మాత్రం ఒంటరిగా హైదరాబాద్ లోనే కాలం వెళ్లదీసుకునేది. ఈమె జీవితంలో నటనా ప్రస్థానం నవ్వుతూ, నవ్విస్తూ ఎంత సంతోషంగా సాగిందో చివరి దశకు వచ్చేసరికి దానికి భిన్నంగా కదలలేని పరిస్థితిలో కష్టాలు అనుభవించింది. తన ఇంట్లో ఓ మూలన మంచంపై పడుకుంది. చివరికీ చీమలు కుడుతున్న కూడా లేవని స్థితిలో ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లడం బాధాకరం. చాలా మందికి సహకారం అందించిన నిర్మలమ్మ జీవితం ఈవిధంగా ముగియడం ప్రతీ ఒక్కరినీ కన్నీరు పెట్టించింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
భోళాశంకర్ ప్రోమోకి రెస్పాన్స్ మామూలుగా లేదుగా.. మరీ సాంగ్ కి ఏ రేంజ్ లో ఉంటుందో ?
నిహారిక పెళ్లికి.. నాగబాబు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా ?