తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో ఏడో సీజన్ నడుస్తోంది. ఈ మధ్యనే మూడు వారాలు పూర్తి కాగా, వారానికి ఒకరు చొప్పున ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు. మరోవైపు హౌసులో ఉన్నోళ్లు గొడవలతో ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. సరే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు హోస్ట్ నాగార్జున రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
బిగ్ బాస్ లో ప్రతి సీజన్ లో కంటెస్టెంట్స్ మారుతున్నారు. కానీ మూడో సీజన్ నుంచి హోస్ట్ గా నాగార్జున పిక్స్ అయిపోయాడు. గతంలో మంచి జోష్ అండ్ ఎనర్జీతో హోస్టింగ్ చేసిన నాగార్జున ప్రస్తుత సీజన్ లో ఇంప్రెస్ చేసే విషయంలో కాస్త తడబడుతున్నాడు. కానీ రెమ్యూనరేషన్ మాత్రం కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ మూడో సీజన్ కోసం రూ. 5-8 కోట్లు, నాలుగో సీజన్ కోసం రూ. 8-10 కోట్లు, ఐదో సీజన్ కోసం రూ. 12 కోట్లు, ఆరో సీజన్ కోసం రూ.16 కోట్లు తీసుకున్నారట. అయితే ఏడో సీజన్ కి వచ్చేసరికి నంబర్ కాస్త పెరిగినట్లు టాక్ వినిపిస్తుంది.
Advertisement
ఎపిసోడ్ కి రూ.15 లక్షల వరకు తీసుకుంటున్నారని.. అలా సీజన్ మొత్తానికి కలిసి రూ.20 కోట్ల వరకు ఆ మొత్తం ఉంటుందని అంటున్నారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న లెక్కలే అని మీరు గుర్తుంచుకోవాలి.ప్రస్తుత సీజన్ నే తీసుకుంటే తొలి రెండు వారాలు కాస్త డల్ గానే సాగింది. మూడో వారానికి వచ్చేసరికి కాస్త ఊపు వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ మళ్ళీ నార్మల్ అయిపోయింది. ప్రస్తుతం హౌసులో 11మంది ఉన్నారు. తొలి 3 వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేట్ అయిపోయి బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉండగా రతిక లేదా టేస్టీ తేజ ఎలిమినేషన్ అయ్యే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి.