Home » పెళ్లి కాకముందే నిహారిక కోసం లావణ్య త్రిపాఠి అంతటి త్యాగం చేసిందా..?

పెళ్లి కాకముందే నిహారిక కోసం లావణ్య త్రిపాఠి అంతటి త్యాగం చేసిందా..?

by Anji
Ad

మెగా ఫ్యామిలీ హీరో అంటే ఎంతో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీ లో స్టార్స్ గా ఎదిగారు. ఇక అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ మోస్తారు స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన గురించి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో వరుణ్ తేజ్ స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో తాళి కట్టి ఏడడుగులు నడవబోతున్నారట. వీరిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం వంటి సినిమాల్లో జంటగా నటించారు. ఇప్పుడు వీరు రియల్ లైఫ్ లో కూడా ఒకటి కాబోతున్నారని చాలా సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది.

Advertisement

అయితే వీరి ప్రేమ విషయాన్ని మాత్రం ఎవరికీ తెలియకుండా మెయింటెన్ చేస్తూ వచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో వీరి ప్రేమ వ్యవహారం మీడియా కంటపడడంతో బయటకు వచ్చింది. దీంతో ఇరు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలోనే లావణ్య త్రిపాఠి, నిహారిక గురించి ఓ వార్త వైరల్ గా మారింది. అయితే గత ఏడాది కాలంగా లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ తో కలిసి ఇంటికి కూడా వచ్చేదట. ఈ సందర్భంలో నిహారిక విడాకులు తీసుకుంటుందనే విషయం తెలిసి చాలా బాధపడిందట.

Advertisement

ఎలాగైనా నిహారికను విడాకులు తీసుకోకుండా ఆపి, ఆమె జీవితం చక్కపడే వరకు మనం పెళ్లి చేసుకోవద్దని వరుణ్ తేజ్ తో కూడా చెబుతూ వస్తుందట. లేదంటే వీరి వివాహం గత ఏడాది అయ్యేదట. ప్రస్తుతం నిహారిక జీవితం కాస్త గాడిన పడడంతో జూన్ 9న వీరిద్దరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా చేయడానికి నిశ్చయించుకున్నారు. 2020లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీరి పెళ్లికి లావణ్య త్రిపాఠి కూడా వచ్చింది. అయితే పెళ్లి తర్వాత నీహారిక, జొన్నలగడ్డ చైతన్య కి మధ్య వివాదాలు రావడంతో ఇద్దరు వేర్వేరు గా ఉంటున్నారు. ఈ తరుణంలోనే లావణ్య వీరి కాపురాన్ని చక్కదిద్దె ప్రయత్నం ప్రారంభించడంతో మెగా ఫ్యామిలీ కి ఈమె ఎంతో నచ్చిందట.. దీంతో లావణ్య త్రిపాఠి నీ కోడలుగా చేసుకునేందుకు ఒప్పుకున్నారట.

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

బొమ్మరిల్లు సినిమాకి “సిద్దార్థ్” విషయంలో ఇంత అన్యాయం జరిగిందా ? మూవీ బ్లాక్ బస్టర్ కానీ..?

అన్నగారు చివరి రోజుల్లో “నా అసలైన వారసుడివి నువ్వేరా” అని ఎందుకు చెప్పారంటే ?

Visitors Are Also Reading