నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన సినిమాల్లో, రాజకీయపరంగా రాణించి ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల్లో తనకు ఎవ్వరూ సాటిలేరనే విధంగా పలు పాత్రల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆయన ఏదైనా పని చేయాలనుకుంటే పట్టు పట్టి మరీ ఆ పని పూర్తి చేసేవారట. చాలా వరకు సీనియర్ ఎన్టీఆర్ నుదుటి నుంచే జూనియర్ ఎన్టీఆర్ ఉద్భవించాడని చెబుతుంటారు.
నటనలో తాత స్టైల్‌ని అనుకురిస్తుంటారు. జూనీయర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాకి పరుచూరి బ్రదర్స్ డైలాగ్‌లు రాశారు. ఇక ఆ సినిమాకి బెల్లంకొండ సురేష్ సోదరి నాగలక్ష్మి పట్టుబట్టి మరీ ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్‌తోనే రాయించారట. ఈ చిత్రానికి డైలాగ్‌లు రాసిన సందర్భంలో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను పరుచూరి గోపాలకృష్ణ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆది సినిమా డైలాగ్స్ చదువుతున్నప్పడు పరుచూరి రెండో కూతురు నాగసుష్మ బాలకృష్ణ గారి స్క్రిప్ట్ లా ఉంది. ఎన్టీఆర్ చిన్నోడు కదా అనే సందేహం వ్యక్తం చేసిందట. ఆయనది నందమూరి తారకరామారావు గారి రక్తం.. అది ఎవరు చెప్పినా ఆ డైలాగ్ అయితే పండుతుంది అని చెప్పారట.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : చాణక్య నీతి: ఇలాంటివారు నిద్రపోతుంటే అసలు లేపకండి.. ఒకవేళ లేపితే అంతే..!
ఆది సినిమా క్లైమాక్స్ షూటింగ్ విశాఖ పట్నంలో నిర్వహించారట. షూటింగ్ జరిగే క్రమంలో జూనియర్ ఎన్టీర్ కి గ్లాస్ తగిలి దెబ్బ తగిలింది. అప్పుడు షూటింగ్ కొద్ది సేపు షూటింగ్ ఆపేశారట. అయితే పరిచూరి వెంటనే దర్శకుడు వినాయక్ వద్దకు వెళ్లి షూటింగ్ ఆపేశారా అని అడిగారట. వెంటనే వినాయక్ లేదు తారక్ షూటింగ్ చేస్తున్నాడని చెప్పాడట. ఆ క్షణంలో సీనియర్ ఎన్టీఆర్ మొండితనం తనకు కనిపించిందని చెప్పాడు. సర్దార్ పాపారాయుడు సినిమా క్లైమాక్స్ లో కూడా ఎన్టీఆర్ చేతికి దెబ్బతగిలినప్పటికీ షూటింగ్ ఆపకుండా పూర్తి చేశారని పరుచూరి గుర్తు చేశారు. ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ చేతికి దెబ్బ తగిలినంత మాత్రాన షూటింగ్ ఎందుకు ఆపాలని ప్రశ్నించారట. సర్దార్ పాపారాయుడు సినిమా ఎలా బ్లాక్ బస్టర్ హిట్ అయిందో.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా కూడా అదేవిధంగా సూపర్ హిట్ అయింది. 2002 మార్చి 28న విడుదల అయిన ఆది ఏకంగా 96 కేంద్రాల్లో 100 రోజులు ఆడడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌కి ఆది సినిమా ఓ టర్నింగ్ పాయింట్ అనే చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి : పంచ్ ప్రసాద్ భార్య గురించి హైపర్ ఆది ఏమన్నారో తెలుసా..?