దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈయన పేరుకి మలయాళం హీరో అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకుల్లో ఈ హీరోకి ఉన్న క్రేజ్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. గతంలో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్, మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు హీరోల లిస్ట్ లోకి చేరిపోయాడు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ తాజాగా కింగ్ ఆఫ్ కోత మూవీతో ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ కింగ్ ఆఫ్ కొత్త మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా నాచురల్ స్టార్ నాని, రానా దగ్గుపాటి హాజరయ్యారు. కాగా ఈ ఈవెంట్ లో రానా దగ్గుపాటి.. దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ పై పరోక్షంగా పలు విమర్శలు చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరూ రానా చేసిన ఈ వ్యాఖ్యల గురించే మాట్లాడుతుండడంతో హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా రానా కామెంట్స్ పై పరోక్షంగానే స్పందించింది. దాంతో ఈ వివాదం హైలెట్ అయింది. ఇలాగే చూస్తూ ఉంటే ఈ వివాదం అనవసరమైన చర్చలకు దారితీస్తుందని గమనించిన రానా వెంటనే ఈ ఇష్యూ పై స్పందిస్తూ ట్విట్టర్ లో సల్మాన్ కు సోనమ్ కపూర్ కు క్షమాపణలు కూడా చెప్పాడు.
Advertisement
Advertisement
ఇక లేటెస్ట్ గా కింగ్ ఆఫ్ కోత సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న దుల్కర్ సల్మాన్ ను రానా వ్యాఖ్యలపై యాంకర్ ప్రశ్న అడగ్గా దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ.. నేను వాటిపై మాట్లాడాలనుకోవట్లేదు. అవి పూర్తిగా రానా వ్యక్తిగత వ్యాఖ్యలు. నాకు ఇండస్ట్రీలో చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో రానా కూడా ఒకరు. నేను ఎవరిపై కంప్లైంట్ చేయను. నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను. రానా ఆ విషయాన్ని కావాలని అయితే చెప్పి ఉండరు. స్టేజీపైకి వచ్చాక నా గురించి మాట్లాడుతూ.. అలా చెప్పారు. అందుకే ఆయన తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు అని అన్నారు. అయితే ఈ కామెంట్స్ బట్టి చూస్తే మాత్రం దుల్కర్ సల్మాన్ రానా ను కాస్త విమర్శించినట్టే తెలుస్తోంది.