Home » భార్య మరణించిన తరువాత దిల్ రాజు ఆ టాప్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారా ?

భార్య మరణించిన తరువాత దిల్ రాజు ఆ టాప్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారా ?

by Anji
Ad

దిల్ సినిమాతో టాలీవుడ్ లో నిర్మాతగా పరిచయమయ్యారు దిల్ రాజు. తన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దిల్ సినిమాకు ముందు నైజాం డిస్ట్రిబ్యూటర్ గా రాజు ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే అప్పటి వరకు రాజును అందరూ నైజాం రాజు అని పిలిచేవారు. దిల్ సక్సెస్ తర్వాత అందరూ దిల్ రాజు అని పిలవడం ప్రారంభించారు. అదే పేరు పాపులర్ అయిపోయింది. దిల్ తరువాత కొన్ని సూపర్ హిట్ సినిమాలను నిర్మించి టాలీవుడ్ లో తిరుగులేని నిర్మాతగా ఎదిగారు. అంతేకాదు.. ఒక తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి నిర్మాతగా ఆ రేంజ్ లో ఎదిగిన క్రెడిట్ కూడా దిల్ రాజుకే దక్కుతుందని చెప్పాలి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్ ద్వారా చిన్న హీరోలకు లైఫ్ ఇస్తూనే పెద్ద హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మిస్తున్నారు.

Also Read : బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు అదే రేంజ్ లో హిట్ అందుకున్న రాజశేఖర్ సినిమా ఇదే..!

Advertisement

Manam

ప్రస్తుతం దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతితో ఓ సినిమా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మరో సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఫ్యాన్స్, ప్రేక్షకుల దృష్టి మొత్తం ఈ భారీ బడ్జెట్ చిత్రాలపైనే ఉంది. దిల్ రాజు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రీసెంట్ గా ఓ కొడుకుకు జన్మనిచ్చారు. అయితే దిల్ రాజుకు మొదట అనితతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే దిల్ రాజు మొదటి భార్య మరణించింది. దిల్ రాజు, అనిత దంపతుల కూతురు హన్సిత రెడ్డికి ఇప్పటికే పెళ్లి కావడంతో పాటు ఓ బాబు ఉన్నాడు. అయితే మొదటి భార్య అనిత అనారోగ్యంతో మృతి చెందడంతో.. దిల్ రాజు రెండో భార్యగా తేజస్వినిని వివాహం చేసుకున్నాడు.

Advertisement

Also Read : ఈ స్టార్ హీరోలు ఇండస్ట్రీకి రాకముందు ఇలాంటి పనులు చేసేవారా..?

Manam

ఇక వీరి వివాహం ఎలాంటి ఆడంబరం లేకుండా జరగింది. పెళ్లి తరువాత స్టార్స్ కు దిల్ రాజు ఘనంగా పార్టీ ఇచ్చారు. రీసెంట్ గా రెండో భార్యతో కొడుకుకు జన్మనివ్వడంతో దిల్ రాజు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో రూమర్లు రావడం కామన్. దిల్ రాజు విషయంలోనూ కొన్ని రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇక పోతే దిల్ రాజు మొదటి భార్య మరణించిన తర్వాత కొంతకాలానికి రెండో వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాకుండా ఇక దిల్ రాజు వివాహం హీరోయిన్ అనుష్కతో జరగబోతుందని ప్రచారం కూడా జరిగింది. ఆ వార్తలను హీరోయిన్ అనుష్క తీవ్రంగా ఖండించింది. అయితే ఆ తర్వాత కొంతకాలానికి దిల్ రాజు తేజస్విని వివాహం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ రూమర్లకు చెక్ పడింది.

Also Read : పూరి జగన్నాథ్ తమ్ముడు ఎమ్మెల్యే అనే విషయం మీకు తెలుసా ?

 

Visitors Are Also Reading