తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో A 1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించారు ఏపీ సిఐడి పోలీసులు. ఈ మేరకు బలమైన ఆధారాలు కోర్టుకు సమర్పించడంతో… చంద్రబాబు జైలుకు వెళ్లారు. అయితే తాజాగా… నారా చంద్రబాబుపై రెండు సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
Advertisement
అప్పట్లో జరిగిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని వైసిపి ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. అలాగే హైదరాబాదులోని హైటెక్ సిటీ నిర్మాణం సమయంలో చంద్రబాబు నాయుడు ఏకంగా 150 కోట్లు స్కామ్ చేశాడని వైసిపి సోషల్ మీడియా ఆరోపణలు చేస్తుంది. గత 20 సంవత్సరాల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే హైదరాబాదులోని హైటెక్ సిటీని నిర్మించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
Advertisement
దీంతో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలా ఎన్నో టాప్ మోస్ట్ కంపెనీలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాయి. అయితే హైటెక్ సిటీ నిర్మాణం చేసిన సమయంలో… ఆ చుట్టుపక్కల ఉన్న భూములను తన మనుషులకు, తన వర్గానికి చెందిన వారికి తక్కువ ధరకు చంద్రబాబు అమ్మేశారట. అలాగే నాడు హైటెక్ సిటీ నిర్మాణం అంటూ గ్లోబల్ టెండర్లను పిలవకుండా ఏకంగా 150 కోట్లు చంద్రబాబు మింగినట్లు వైసిపి ఆరోపణలు చేస్తోంది. ఇదే విషయాన్ని గతంలో బిజెపి మాజీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామి కూడా పేర్కొన్నారు. కానీ ఆ సమయంలో జైలుకు వెళ్లకుండా చంద్రబాబు స్టే లు తెచ్చుకున్నాడట. ఇప్పుడు ఇదే విషయాన్ని వైసిపి సోషల్ మీడియా హల్చల్ చేస్తోంది.
https://x.com/Anithareddyatp/status/1707612352412328193?s=20
ఇవి కూడా చదవండి
- కోహ్లీని ఔట్ చేయడానికి 5 బంతులు చాలు : నెదర్లాండ్స్ బౌలర్
- తన మొదటి భార్యకు అక్కినేని నాగార్జున ఎందుకు విడాకులు ఇచ్చాడు ?
- రానా కారణంగా త్రిష, ప్రభాస్ పెళ్లి క్యాన్సిల్ అయిందా ?