Home » 2023లో ఏం జరుగుతుందో బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు!

2023లో ఏం జరుగుతుందో బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు!

by Anji
Published: Last Updated on
Ad

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన అపారమైన జ్ఞానంతో భవిష్యత్ లో ఏం జరుగబోతుందో ముందు చెప్పారు. కాలక్రమంలో చూస్తున్నటువంటి మార్పులను చూస్తుంటే.. వీటన్నింటిని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ప్రస్తావించారని తెలుస్తోంది.

Advertisement

మనం ఎక్కడో ఏ వింత జరిగిన అది ముందే బ్రహ్మంగారు చెప్పారు అంటూ గుర్తు చేసుకుంటున్నాం. ఇలాంటి వాటిలో కరోనా వైరస్ ఒకటి.. కరోనా గురించి బ్రహ్మంగారు ముందు కాలజ్ఞానంలో  ప్రస్తావించారట. కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయా అంటూ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో  చెప్పారు. 

Also Read :  రెండో పెళ్లికి రెడీ అవుతున్న సింగ‌ర్ కౌస‌ల్య‌…వ‌రుడు ఎవ‌రో ఏం చేస్తాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

కరోనా మహమ్మారి తరువాత ఈ భయంకరమైన పరిస్థితులు ఇంతటితో ఆగిపోవని బ్రహ్మంగారు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోంది. ప్రస్తుతం బ్రిటన్ నుంచి కొత్త వైరస్ స్ప్రైడ్ అవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ దేశాలకు సూచిస్తుంది. ఇంతటితో కరోనా అయిపోలేదని, పరిస్థితి మరింత భయంకరంగా మారే అవకాశముంది. కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే.. కరోనా ఇంకా అయిపోలేదని రకరకాల  కొత్త వైరస్ లు పుట్టుకొస్తున్నాయని తెలుస్తోంది.  ముఖ్యంగా కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు పాటుపడుతుందని చెప్పారు.. చెప్పినట్టుగానే 1910-12 కాలంలో గంగానదికి వరదలు రావడం.. ఆ సమయంలోనే కలరా వ్యాధి వ్యాపించడం కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడానికి ఎవ్వరూ కూడా రాలేదు. 

Advertisement

Also Read :   ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన కాలబైరవ.. ఎందుకంటే ? 

అదేవిధంగా ఓ అంబ 16 ఏళ్ల పాటు రాజ్యాన్ని పాలిస్తుందని.. బ్రహ్మంగారు చెప్పినట్టే ఇందిరాగాంధీ 16 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించింది. స్త్రీలపై అక్రమాలు ఎక్కువవుతాయని.. వ్య*చారిల వల్ల భయంకరమైన వ్యాధులు సంభవించే అవకాశముందని చెప్పారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధి ప్రజలను ఎలా భయబ్రాంతులకు గురి చేస్తుందో దాదాపు అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా దీనికి మందు కనుక్కోకపోవడం గమనార్హం. అదేవిధంగా కృష్ణానది కనకదుర్గమ్మ ముక్కుపుడక తాకుతుందని కూడా చెప్పారు బ్రహ్మంగారు. జల ప్రళయం జరిగి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పారితే కృష్ణానది దుర్గమ్మను తాకే ప్రమాదముంది. బ్రహ్మంగారు చెప్పినవన్ని దాదాపుగా నిజమవుతున్నాయని ప్రజలకు ఓ నమ్మకం. చూడాలి ఏంజరుగుతుందనేది. 

Also Read :  వేసవిలో బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తప్పక తాగండి..!

Visitors Are Also Reading