తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బిగ్ బాస్ ఫీవర్ కొనసాగుతుంది. మొదటి వారం నుంచే ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న బిగ్ బాస్.. ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. అయితే ఇందులో ఇటీవలే ఎలిమినేట్ అయిన రతిక రోజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే.. హౌస్ లో ఉన్న కొద్ది రోజులు ఆమె చేసిన రచ్చ అంతా ఇంత కాదు.. అందుకే రతిక రోజ్ ను ప్రేక్షకులు ఇంటికి పంపించేశారు. అయితే బిగ్ బాస్ ఉల్టాపుల్టా వల్ల వైల్డ్ కార్డుతో మరోసారి రతిక రోజ్ హౌస్ లోకి మళ్లీ రాబోతున్నట్టు సమాచారం. రీ ఎంట్రీతో హౌస్ లో మరింత హీట్ పెరిగే ఛాన్స్ ఉంది.
Advertisement
Advertisement
ఇక బిగ్ బాస్ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. రతిక రోజ్.. సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన విషయం విధితమే. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో రతిక ఓ చిన్న రోల్ చేసింది. విలన్స్ గ్యాంగ్ లో ఓ మినిస్టర్ పాత్రలో కొన్ని నిమిషాలు కనిపించింది. ఈ చిత్రంలో రతిక కనిపించిన వెంటనే థియేటర్స్ లో బిగ్ బాస్ ఫాలోవర్స్ రచ్చ రచ్చ చేశారు. ఈ పాత్ర 5 నుంచి 10 మిషాల కంటే ఎక్కువగా ఉండదు.
కానీ ఈ పాత్ర కోసం రతిక రోజ్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ లో వస్తున్న కథనాల ప్రకారం.. భగవంత్ కేసరి మూవీకి రతిక దాదాపు 5లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. వాస్తవానికి రతిక స్క్రీన్ పై ఇంకా ఎక్కువ సమయమే కనిపించాల్సి ఉండేదట. కానీ ఎడిటింగ్ లో చాలా వరకు పోయిందని.. చివరికీ 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా చిన్న చిన్న పాత్రలు చేసుకునే రతిక రోజ్ కు బాలయ్య మూవీలో ఛాన్స్.. 5లక్షల పారితోషికం ఎక్కువే అని చెప్పవచ్చు.