నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ నట వారసుడిగా నందమూరి బిడ్డగా పదహారేళ్ల వయసులోనే బాల నటుడుగా సినిమాల్లోకి వచ్చాడు. ప్రస్తుతం మాస్ హీరోగా బాలకృష్ణ హీరోగా రాణిస్తున్నాడు. అతనికి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది . వాస్తవానికి బాలకృష్ణ కెరీర్ ప్రారంభించిన సమయంలో తండ్రితోనే ఎక్కువ సినిమాల్లో నటించాడు. తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. తాను సోలో హీరోగా కూడా నటించి.. మాస్ సినిమాలను తీస్తూ వచ్చారు.
Advertisement
సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రాలలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించగా అతని భక్తుడు అయిన సిద్ధప్ప పాత్రలో బాలకృష్ణ నటించాడు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత అది సృష్టించిన ప్రభంజనం అంతా కాదు. అప్పట్లోనే దాదాపు నాలుగు కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. వాస్తవానికి ఈ చిత్రం అంతకంటే ముందు ఎప్పుడో విడుదలవ్వాలి. కానీ సెన్సార్ బోర్డు వారి అభ్యంతరాల వల్ల పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది.
Advertisement
చివరికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ఈ సినిమా విడుదలై రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద విజయం సాధించే చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఎన్టీఆర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ తన కొడుకు బాలకృష్ణ కూడా అందులో మెలకువలు నేర్పించారట. ఈ చిత్రం ద్వారా బాలయ్యకి సినిమా తీసే విధానం కూడా పూర్తిగా నేర్పించారట. అంతేకాదు అనేక షాట్స్ స్వయంగా బాలకృష్ణ కెమెరామెన్ గా పని చేసి తీసారట. అలా బాలకృష్ణ కెరీర్ లో కెమెరా మెన్ గా పనిచేసిన ఏకైక సినిమా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సినిమా.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!