ఐపీఎల్ సీజన్ 15 మరొక మూడు ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రికెటర్లు ప్రాక్టిస్ ప్రారంభించారు. ఈ లీగ్‌లో తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగనున్నది. దీంతో ఈ రెండు జట్లు ఇప్పటికే ప్రాక్టిస్ సెషన్స్ ప్రారంభించాయి. వీళ్ల ప్రాక్టిస్ సెషన్లకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక వీడియో మాత్రం తెగ ఆకట్టుకుంటోంది. అందులో ధోని కేవలం ఒంటి చేత్తో భారీ సిక్సర్ కొట్టాడు.
Advertisement
ఇది చూసిన నెటిజన్లు ధోని ఈస్ బ్యాక్. మళ్లీ తన విశ్వరూపం ఏమిటో చూపించడానికి సిద్ధమవుతున్నాడంటూ.. కామెంట్లు పెడుతున్నారు. విరాట్ కోహ్లీ, రహానే వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఇప్పుడు సరిగ్గా ఆడలేక సతమతమవుతున్నారు. అలాంటిది ధోని భారీ షాట్లు ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం సీఎస్‌కే ప్లేయర్లు సూరత్‌లోని లాలాభాయ్ కాంట్రాక్టు స్టేడియంలో ప్రాక్టిస్ చేస్తున్నారు. ఈ స్టేడియంలోనే పిచ్ రియల్ మ్యాచ్‌లు జరిగే ముంబయి పూణే వంటి పిచ్ లను పోలి ఉంటుంది.
Advertisement
అందుకే ధోని సేన ఇక్కడే ప్రాక్టిస్ చేస్తుంది. ఈ క్రమంలోనే ధోని భారీ షాట్లు ఆడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోను దీప్తి రంజన్ అనే ఒక ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు. వన్ హ్యాండెడ్ సిక్సర్ అని దీనికి క్యాప్షన్ జోడించారు. అయితే ధోని ఒంటి చేత్తో సిక్సర్ కొట్టినా వీడియోను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియోపై పలువురు కామెంట్లు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
One handed six @msdhoni 🥵🥵 pic.twitter.com/DkO6X7CDcx
— DIPTI MSDIAN ⛑ (@Diptiranjan_7) March 7, 2022