టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్రసింగ్ ధోనికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మహేంద్ర సింగ్ ధోని ఏది చేసినా ట్రెండింగ్ లోకి వస్తుంది. ఇప్పటికే టీమ్ ఇండియాకు మూడు ఐసీసీ టోర్నమెంట్లు అందించాడు మహేంద్రసింగ్ ధోని. 2007 t20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్ ట్రోఫీలను టీమిండియా జట్టుకు అందించి చరిత్ర తిరగరాసాడు మహేంద్ర సింగ్ ధోని.
Advertisement
మహేంద్రసింగ్ ధోని రిటర్మెంట్ తర్వాత… అంటే 2013 నుంచి ఇప్పటివరకు గత అది సంవత్సరాలలో టీమిండియా కు ఏ ఒక్క ఐసీసీ టోర్నమెంట్ రాలేదు. కానీ ధోని సారథ్యంలో ఏకంగా మూడు వచ్చాయి. దీన్నిబట్టి చూస్తే మనకు ధోని కెప్టెన్సీ గురించి స్పష్టంగా అర్థం అవుతుంది. అలాగే వికెట్ల వెనుక చాలా ప్రశాంతంగా ఉండి.. బౌలర్లకు సలహాలు ఇచ్చి మంచి విజయాలను జట్టుకు అందించగల సమర్థుడు మహేంద్రసింగ్ ధోని. ఇది ఇలా ఉండగా… మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది.
Advertisement
వన్డే వరల్డ్ కప్ టీమ్ ఇండియా మెంటార్ గా మహేంద్ర సింగ్ ధోని నియమించేందుకు భారత క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. గతంలో టి20 వరల్డ్ కప్ సమయంలో కూడా టీమిండియా మెంటార్ గా ధోని విధులు నిర్వహించాడు. అప్పుడు టీమిండియా మంచి విజయాలను అందుకుంది. ఇక ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరగనుంది. ఈసారి ఎలాగైనా వన్డే వరల్డ్ కప్ గెలవాలని…. ధోనిని రంగంలోకి దించాలని బీసీసీ ఐ యోచిస్తోంది. దీనికి మహేంద్రసింగ్ ధోని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఇక ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
ఇవి కూడా చదవండి
Shubman Gill : టీమిండియా కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ?
2007 లో ధోనీనే కెప్టెన్‌గా ఎందుకు BCCI నియమించింది ?
Hardik Pandya : హార్ధిక్ పాండ్యా షూస్ కొట్టేసిన కృనాల్ భార్య..రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్