టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన విషయం అందరికీ తెలిసిందే.. దీంతో ఆయన అభిమానులంతా ఆందోళనలో ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్ లోని రూర్కీ ప్రాంతంలో రిషబ్ కారు ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయింది. ఢిల్లీ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీ కొట్టి 200 మీటర్ల దూరం దూసుకెళ్లింది.
Advertisement
also read:CRPF హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ జారీ..1315 పోస్టులు.. భారీ జీతం..!!
దీంతో కారులో మంటలు చెలరేగడంతో సమయస్ఫూర్తితో పంత్ కారు నుంచి బయటకు వచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త నిలకడగానే ఉందని బిసిసిఐ తెలియజేసింది. తీవ్రమైన గాయాలైనప్పటికీ పంత్ కోలుకుంటాడని తెలిపింది. అయితే ఈ ప్రమాద ఘటన జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.. మూడు సంవత్సరాల క్రితమే శిఖర్ ధావన్.. రిషబ్ పంతును డ్రైవింగ్ విషయంలో హెచ్చరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2019 ఐపీఎల్ సమయంలో పంత్ మరియు ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడిన విషయం మనందరికీ తెలిసిందే.
Advertisement
Shikhar Dhawan gave Rishabh Pant right advice about driving. pic.twitter.com/XxFRE5K74j
— Ami ✨ (@kohlifanAmi) December 30, 2022
ఈ తరుణంలోనే వీరిద్దరూ సరదాగా ఒక ఇంటర్వ్యూ చేసుకున్నారు. అయితే ఈ టైంలో తనకంటే సీనియర్ అయిన దావన్ ను.. అన్నయ్య ఒక సీనియర్ గా నువ్వు ఏమి సలహా ఇస్తావు అని అడిగారు పంత్.. దీంతో ధావన్ మాట్లాడుతూ ” డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్త వహించు” అని చెప్పాడు. అయితే తాజాగా రిషబ్ పంత్ కారు ప్రమాదం బారిన పడటంతో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీనిపై చాలామంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.
also read:
- Waltair verayya song: వాల్తేరు వీరయ్యలో చిరు వేసిన ఈ షర్ట్ తో రామ్ చరణ్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా…?