Home » అయోద్య రామాల‌యానికి ధ‌ర్మ‌వ‌రం ప‌ట్టుచీర‌

అయోద్య రామాల‌యానికి ధ‌ర్మ‌వ‌రం ప‌ట్టుచీర‌

by Anji
Ad

అయోద్య‌లో నిర్మితం అవుతున్న భ‌వ్య‌దివ్య మందిర నిర్మాణానికి ధ‌ర్మ‌వ‌రం నేత‌న్న అపురూప‌మైన కానుక‌ను అందించ‌నున్నారు. పూర్తిగా రామ నామాల‌తో నిండిన అరుదైన ప‌ట్టుచీర‌ను అయోధ్య రామాల‌యానికి అందించ‌నున్నారు.

Advertisement

ముఖ్యంగా ధ‌ర్మ‌వరానికి చెందిన డిజైన‌ర్ నాగ‌రాజు త‌మ ప‌నిత‌నంతో ఇప్ప‌టికే ఎన్నో అద్భుతాల‌ను సృష్టించిన నేత‌న్న‌లు, చేనేత వైభ‌వాన్ని మ‌రొక‌సారి ప్ర‌పంచానికి చూపించ‌నున్నారు. ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు ఉన్న ప‌ట్టు వ‌స్త్రాన్ని రామాల‌యం కోసం నాలుగు నెల‌ల‌పాటు క‌ష్ట‌ప‌డి రూపొందించారు. శ్రీ‌రామ నామాల‌తో పాటు.. రామాయ‌ణ ఘ‌ట్టాల‌తో 16 కిలోల బ‌రువు ఉండే ఈ చీర‌.. 180 అడుగుల పొడ‌వు ఉంటుంది.

Advertisement

స‌ప్త‌వ‌ర్ణాల‌తో త‌యారైన ఈ ప‌ట్టుచీర‌లో 13 భాష‌లో జై శ్రీ‌రామ్ అన్న అక్ష‌రాల‌ను అందంగా, అద్భుతంగా కూర్చారు. దీంతో పాటు 168 ర‌కాల రామాయ‌ణ చిత్రాలు ఉండేలా ప‌ట్టుచీరను డిజైన్ చేసారు. ఈ ప‌ట్టుచీర మొత్తం 32,200 జై శ్రీ‌రామ్ నామాల‌ను నేత‌న్న‌లు పొందుప‌రిచారు. చేనేత మ‌గ్గంపై రూపొందించిన చీర త‌యారీకి నాలుగు నెల‌ల పాటు శ్ర‌మించిన‌ట్టు వెల్ల‌డించారు. ప‌ట్టుచీర‌ల‌కు ప్ర‌త్యేకం అయిన‌టువంటి ధ‌ర్మ‌వ‌రంలో న‌లుగురు నేత‌న్న‌లు నాలుగు నెల‌ల పాటు శ్ర‌మించి ఈ ప్ర‌త్యేక వ‌స్త్రాన్ని రూపొందించారు. ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి ఆవిష్క‌రించారు. అత్యంత‌ త్వ‌ర‌లోనే ప‌ట్టు వ‌స్త్రాన్ని అయోధ్య‌లో రామ మందిరానికి బ‌హుక‌రించిన‌ట్టు డిజైన‌ర్ నాగరాజు తెలిపారు.

ఇవి చద‌వండి :

  1. కొండ చిలువ‌ను క‌ర‌క‌ర న‌మిలి తినేసిన రాకాసి బ‌ల్లి..!
  2. టీ తాగేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలో వీటిని అస్స‌లు తీసుకోకూడ‌దు జాగ్ర‌త్త‌..!
  3. మన స్టార్ హీరోయిన్లు వేసుకున్న టాటూలు, వాటి వెనుకున్న అర్థాలు అవేనా ?
Visitors Are Also Reading