టాలీవుడ్ హీరోయిన్ ధన్య బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధన్య బాలకృష్ణ బెంగళూరులో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి. ధన్య సూర్య, శృతిహాసన్ నటించిన 7అమ్ అరివు, తెలుగులో 7th సెన్స్ వచ్చిన సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత ఆమె లవ్ ఫెయిల్యూర్, ఎటో వెళ్లిపోయింది మనసు వంటి సినిమాల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ తర్వాత ఆమె 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో కూడా కనిపించింది.
READ ALSO : Income Tax Raid : ఇన్ కమ్ టాక్స్ రైడ్స్ ఎలా చేస్తారు ? రైడ్ లో దొరికిన డబ్బును ఏం చేస్తారో తెలుసా ?
Advertisement
ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ ఉన్న ఈ భామకు మరిన్ని హీరోయిన్ అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు. ఇదంతా పక్కకు పెడితే, ధన్య బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ ను రెండో వివాహం చేస్తుకుందని అయితే ఈమె పెళ్లి చేసుకుని దాదాపుగా ఏడాది కావస్తోందని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇటీవల యశోద సినిమాలో నటించిన నటి కల్పిక గణేష్ తెలియజేసినట్లు సమాచారం.
Advertisement
ధన్య బాలకృష్ణ కోలీవుడ్ డైరెక్టర్ అయిన బాలాజీ మోహన్ ను ఈ ఏడాది జనవరిలో రెండవ వివాహం చేస్తుందని తెలియజేసింది. మొదటి నుంచి ధన్య చెన్నైకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాలాజీ తో టైం స్పెండ్ చేసేదని కూడా తెలియజేసింది నటి కల్పిక గణేష్. ఆ డైరెక్టర్ కు వివాహమై భార్యకు విడాకులు ఇచ్చాడని, దన్య వివాహం చేసుకొని సీక్రెట్ గా కాపురం చేస్తోంది అంటూ పలు సంచలన విషయాలు బయట పెట్టింది నటి కల్పిక గణేష్. అందుకే ఆమె ఎక్కడా బయట కనిపించలేదని కూడా తెలియజేసింది కల్పిక. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే, దీనిలో ఏ మేరకు నిజం ఉందో చూడాలి.
READ ALSO : 2022 సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటిన డబ్బింగ్ సినిమాలు