Home » రాయన్ సినిమాతో ధనుష్.. టైటిల్ కి అర్ధం ఏమిటో తెలుసా..?

రాయన్ సినిమాతో ధనుష్.. టైటిల్ కి అర్ధం ఏమిటో తెలుసా..?

by Sravya
Ad

తమిళ స్టార్ హీరో ధనుష్ 50వ సినిమా టైటిల్ ని ప్రకటించేశారు ఇటీవల సంక్రాంతి కానుకగా కెప్టెన్ మిల్లర్ సినిమా వచ్చింది. అయితే ధనుష్ ఈసారి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీకి రాయన్ అనే టైటిల్ ని పెట్టారు అయితే ఈ సినిమా టైటిల్ వెనుక అర్థం ఏంటనే విషయాన్నికి వస్తే .. రాయన్ అంటే లీడర్ అని అర్థం. ఈ చిత్రం కూడా యాక్షన్ త్రిల్లర్ గా రాబోతోంది ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇంటెన్స్ గా కనిపించారు ఒక ఫుడ్ ట్రక్ ముందు ఒక ఆయుధాన్ని పట్టుకుని ఉన్నారు. ఫుడ్ ట్రక్ లో సందీప్ కిషన్ కాళిదాసు జయరాం కూడా ఆయుధాలు పట్టుకుని ఉన్నారు.

Advertisement

Advertisement

ఇటీవల రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్లో కూడా సందీప్ కిషన్ పోషించారు. సందీప్ కిషన్ ఇప్పుడు మళ్లీ ధనుష్ తో ఇంకో సినిమా చేస్తున్నాడు. సందీప్ కిషన్ ఈ సినిమాకి దర్శకత్వంతో పాటుగా కథ కూడా ధనుష్ ది కావడం విశేషమని చెప్పొచ్చు. ఈ మూవీ లో నిత్యామీనన్, ఎస్ జె సూర్య, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్, అనికా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. తమిళ్ తో పాటుగా తెలుగు హిందీ భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ అవ్వబోతోంది. మూడు భాషలకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లని రిలీజ్ చేశారు. ట్విట్టర్ వేదికగా వీటిని ట్వీట్ చేశారు. స్వీయ దర్శకత్వంలో ధనుష్ సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. పైగా ఇప్పటి దాకా సినిమాకి సంబంధించిన అప్డేట్లు కూడా ఎక్స్పెక్టేషన్స్ని భారీగానే పెంచేశాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading