Dhamaka Movie review Telugu: మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించిన మేర ఫలితం సాధించలేదు. ఆ తర్వాత రవితేజ నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో ధమాకా సినిమాలో నటించాడు. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో శ్రీలీల రవితేజకు జోడిగా నటించింది. చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించారు. సినిమా టీజర్ మరియు ట్రైలర్లకు ఎంతో క్రేజ్ వచ్చింది. దాంతో సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందు వచ్చింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అయిందా…? లేదా…? అనేది ఇప్పుడు చూద్దాం…
సినిమా కథ :
Advertisement
సినిమాలో ఆనంద్ చక్రవర్తి (రవితేజ) పీపుల్ మార్ట్ అనే ఓ ప్రముఖ కంపెనీ యజమాని కుమారుడు. అదేవిధంగా స్వామి (రవితేజ) మధ్య తరగతి కుటుంబంలో జన్మిస్తాడు. సినిమా కథ విషయానికి వస్తే ఓ కార్పొరేట్ దిగ్గజం.. ఆనంద్ చక్రవర్తి తండ్రికి సంబంధించిన పీపుల్ మార్ట్ కంపెనీని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ కార్పొరేట్ కంపెనీ దక్కించుకోవడానికి పోరాటం మొదలు పెడతాడు. దాంతో ఆనంద్ చక్రవర్తి విలన్ తో ఎలా పోరాడతాడు…? సినిమాలో స్వామి పాత్ర ఏంటి …? శ్రీలల తో ప్రేమ ఎలా పుడుతుంది…. అన్నదే ఈ సినిమా కథ.
Advertisement
విశేషణ :
ఈ సినిమాతో రవితేజ తన ఎనర్జీని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. సినిమాలో అభిమానులు కోరుకున్నట్టుగానే రవితేజను చూపించారు. రవితేజ ఎనర్జీ గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. సినిమాలో రవితేజ చేసిన రెండు పాత్రలు చాలా ఆకట్టుకుంటాయి. శ్రీలీల తన గ్లామర్ వలకబోసి యూత్ కు ఈ సినిమాతో మరింత దగ్గర అయింది. అయితే సినిమాలో కొత్త ధనం మాత్రం ఏమీ లేదు… గతంలో రవితేజ సినిమాలను చూసినట్టుగానే ఈ సినిమా కూడా అనిపిస్తుంది. నేను లోకల్ సినిమా చూపిస్త మామ సినిమాలతో హిట్ కొట్టిన దర్శకుడు త్రినాధరావు నక్కిన కథపై మరింత దృష్టి పెడితే బాగుండేదేమో… ఈ మధ్య వచ్చిన చాలా సినిమాల మాదిరిగానే కార్పొరేట్ బ్యాక్ డ్రాప్… కామెడీ, ఫ్యామిలీ డ్రామా లాంటి అంశాలు ఈ సినిమాలో కనిపిస్తాయి.
సినిమాలో పాటలు, యాక్షన్ పార్ట్ బాగున్నప్పటికీ ఏదో లోపించినట్టు అనిపిస్తుంది. దాంతో మొత్తానికి ఒక కొత్త సినిమా చూసిన ఫీలింగ్ మాత్రం ప్రేక్షకుడికి కలగలేదు. భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది. సినిమాలో రెండు పాటలు బాగున్నాయి. మిగితా పాటలు సైతం యావరేజ్ గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రవితేజ మాస్ కు సరిపోయేలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మాస్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా నచ్చే ఛాన్స్ ఉంది.
Also read : 18 Pages Review : ’18 పేజెస్’ మూవీ రివ్యూ..నిఖిల్ ఖాతాలో మరో సినిమా