టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోతే వచ్చే కష్టాల నేపథ్యంలో తెరకెక్కింది. అదే విధంగా తెలంగాణ అబ్బాయి పెళ్లి కోసం ఆంధ్ర కి వెళ్లి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనే కథాంశంతో సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఎంత గానో ఆకట్టుకుంది. కామెడీ మరియు రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది.
Advertisement
ఇక ఇప్పటికే ట్రైలర్ సినిమాపై అంచనాలు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా విశ్వక్ సేన్ అతని టీంతో కలిసి చేసిన ఒక ఫ్రాంక్ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. థియేటర్ ముందు సినిమా రివ్యూలు చెప్పే ఓ యువకుడు విశ్వక్సేన్ సేన్ పై ప్రాంక్ చేస్తూ బాటిల్లో నీళ్లు తీసుకుని పెట్రోల్ అని బెదిరిస్తూ తాను ఆత్మహత్య చేసుకుంటానని నానా రచ్చ చేశాడు.
Advertisement
అయితే ఈ ప్రాంక్ రోడ్డుపై జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రోడ్డుపై పెట్రోల్ పట్టుకుని ప్రాంక్ చేయడం చట్ట విరుద్ధమంటూ అరుణ్ కుమార్ అనే న్యాయవాది హెచ్ఆర్సి ని ఆశ్రయించాడు. విశ్వక్సేన్ పై మరియు ప్రాంక్ చేసిన యువకుడిపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ ఓ మీడియా ఛానల్ లో డిబేట్ కి వెళ్లారు. అయితే డిబేట్ జరుగుతున్న సమయంలో దేవి నాగవల్లి విశ్వక్ సేన్ ల మధ్య గొడవ జరిగింది.
ఈ గొడవలో తనను పాగల్ సేన్… డిప్రెషన్ పర్సన్ అనకూడదని దేవి నాగవల్లిని విశ్వక్ సేన్ ను హెచ్చరించారు. దాంతో దేవి నాగవల్లి వెంటనే గెటవుట్ అంటూ విశ్వక్ సేన్ పై ఫైర్ అయ్యింది. దాంతో విశ్వక్ సేన్ మీరు పిలిస్తే వచ్చాను…. నాకు ఇక్కడ ఒక్క క్షణం ఉండటం కూడా ఇష్టం లేదు…అంటూ మైక్ తీసి స్టూడియో నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also read :
ఆచార్య ఫ్లాప్ అవుతుందని షూటింగ్లోనే చిరు చెప్పారా..? కొరటాల ఏమన్నాడంటే..?
“ఫేక్ బాడీ” అంటూ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటో పై దారుణమైన ట్రోల్స్…!