గత 60 సంవత్సరాలుగా తెలుగు సినిమా రంగంలో ఉన్న కైకాల సత్యనారాయణ 777సినిమాల్లో నటించాడు. ఓ నటుడిగా పౌరాణిక, సాంఘిక చారిత్రక జానపద పాత్రలు చేశాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నింటినో పోషించాడు. తాను పోషించిన వైవిద్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవసర నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు.
Advertisement
తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వీ రంగారావు తరువాత అలాంటి వైవిద్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒరు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీ రంగ ప్రవేశం చేశాడు. తరువాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు. ఈయనకు యముడి పాత్రలు ట్రైలర్ అనేవిధంగా ఉండేవి. యముండ అని ఈయన గర్జిస్తే.. నిజంగా యముడు ఇలాగే ఉంటాడేమో అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ముఖ్యంగా కైకాల సత్యనారాయణ యముడిగా ఎన్ని సినిమాల్లో కనిపించాడో ఇప్పుడు తెలుసుకుందాం.
యమగోల
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా జయప్రద హీరోయిన్‌గా యమగోల చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ యముడిగా కనిపించి అలరించారు. తాతినేని రామారావు తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయమే సాధించింది.
Advertisement
యముడికి మొగుడు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి తెరకెక్కించారు. ఈ సినిమాలో యముడి పాత్రలో సత్యానారాయణ నటన అద్భుతమనే చెప్పాలి. తన అద్భుత నటనతో ప్రశంసలు అందుకున్నారు.
యమగోల మళ్లీ మొదలైంది
తొట్టెంపూడి వేణు, శ్రీకాంత్ హీరోలుగా నటించిన యమగోల మళ్లీ మొదలైంది సినిమాకు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రిటైర్డ్ అయ్యే యముడి పాత్రలో కైకాల సత్యనారాయణ కనిపించారు.
దరువు
శ్రీవేంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవితేజ, తాప్సీ జంటగా ‘సిరుతై’ శివ దర్శకత్వంలో బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన హాస్య ప్రధాన చిత్రం దరువు. ఈ సినిమాలో కైకాల సత్యానారాయణ రిటైర్డ్ అవుతున్న యముడిలా కనిపించారు. యముడి పాత్రకు కైకాల కరెక్ట్ అనిపించేలా తన నటనను పలు సినిమాల్లో పోషించారు.
Also Read : ఐపీఎల్ వేలం గురించి రవిశాస్త్రీ ఏమన్నారో తెలుసా..?