బిగ్ బాస్ సీజన్ 7 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ లు.. అందులో రతిక రీ ఎంట్రీతో కలిపి 20 మంది అని చెప్పాలి. 20 మంది కంటెస్టెంట్స్ 105 రోజుల పాటు చాలా సందడిగా.. ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చింది. బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే నుంచి అంబటి అర్జున్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఈ సీరియల్ నటుడు తనదైన ఆటతీరు, మాటతీరుతో ఆకట్టుకున్నాడు.
Advertisement
ఎలాంటి గొడవలు, వివాదాలకు పోకుండా హౌజ్‌లో హుందాగా వ్యవహరించాడీ సీరియల్ యాక్టర్. టాస్కులు, గేమ్స్‌లో సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. పవర్ అస్త్ర సాధించి ఏడో సీజన్ లో గ్రాండ్ ఫినాలేకు దూసుకెళ్లిన మొదటి కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అంతా బాగున్నా అభిమానుల ఓట్లు సంపాదించడంలో బాగా వెనక బడ్డాడు అర్జున్. అందుకే ఆరో స్థానంతో సరిపెట్టుకుని హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. ఆదివారం జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో అర్జున్ అంబటి మొదటిగా ఎలిమినేట్ అయ్యాడు. స్టార్ యాంకర్ సుమ కనకాల రోబో సహాయంతో అర్జున్ అంబటిని హౌజ్ నుంచి బిగ్ బాస్ స్టేజీపైకి తీసుకొచ్చింది.
అయితే హౌజ్‌లో ఎంతో హుందాగా వ్యవహరించిన అర్జున్ ఎలిమినేషన్ సమయంలోనూ ఎంతో సమయస్ఫూర్తితో మెలిగాడు. ‘నన్ను నువ్వే తీసుకురావాలా’ అంటూ సుమతో చమత్కారంగా మాట్లాడాడు. ఈ సందర్బంగా అర్జున్ అంబటి భార్య సురేఖ బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చింది. చాలా రోజుల తర్వాత తన భర్తను కలవడంతో బాగా ఎమోషనల్ అయ్యింది సురేఖ. ఇక మొత్తమ్మీద అర్జున్ అంబటి సుమారు 10 వారాలు హౌజ్ లో కొనసాగాడు. ఇందుకోసం రోజుకు రూ. 35వేల పారితోషకం తీసుకున్నాడు. అంటే వారానికి సుమారు రూ. 2, 45,000. మొత్తమ్మీద అర్జున్ రూ. 24.5 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇతర కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ అనే చెప్పవచ్చు. బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినా అందుకు సమానమైన రెమ్యునరేషన్ అర్జున్ అందుకున్నట్టె లెక్క. ఒక్క శివాజీ తప్ప మిగతా కంటెస్టెంట్స్ కంటే అర్జున్ రెమ్యునరేషన్ ఎక్కువ.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!