Telugu News » సినిమాలో చిన్న పిల్లలుంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే!

సినిమాలో చిన్న పిల్లలుంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే!

by Bunty

సినిమా పరిశ్రమకు కార్మిక శాఖ కొత్త నిబంధనలు విడుద‌ల చేసింది. 14 సంవత్సరాల్లోపు పిల్లలు ఇకపై ఏ రంగాల్లో పని చేయకూడదని.. సినిమాలో పని చేసే చైల్డ్ ఆర్టిస్టులకు కలెక్టర్ అనుమతి పత్రం తప్పనిసరని కార్మిక శాఖ పేర్కొంది. సినిమా నిర్మాత, దర్శకుడు ఎవరైనా జిల్లా కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలని.. ఇక ముందు సినిమాల్లో బాల కార్మికుల పనితీరు పై కలెక్టర్ల అనుమతి తప్పనిసరని వెల్ల‌డించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది కార్మిక శాఖ. సంబంధిత చైల్డ్ ఆర్టిస్ట్ నుండి అనుమతి కూడా తప్పనిసరి అని పేర్కొంది కార్మిక శాఖ.

Ads

25% పేమెంట్ జాతీయ బ్యాంక్ లో ఫిక్సిడ్ డిపాజిట్ సంబందిత సినిమా నిర్మాత చేయాలని… చైల్డ్ ఆర్టిస్ట్ విద్యకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ఉండేలా చూసుకోవాలని తెలిపింది కార్మిక శాఖ. 14 సంవత్సరాల లోపు ఎవరైనా ఎక్కడైనా పని చేయించుకొంటె కఠిన చర్యలు. ఆరు నుండి ఏడాది జైలు శిక్షతో పాటు 20 నుండి యాబై వేల వరకు జరిమానా విధిస్తామ‌ని…. పనికి పంపించిన తల్లితండ్రులు కూడా శిక్షకు అర్హులేన‌ని చెప్పింది.

సంబందిత చైల్డ్ ఏ పాఠశాలలో అయిన 30 రోజులు గైర్హాజరు అయితే నోడల్ ఆఫీసర్ కు సమాచారం ఇవ్వాలని.. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ని ఏర్పాటు చేసింది కార్మికశాఖ. ఈ కమిటీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ , సభ్యులు గా కార్మిక శాఖ , విద్యాశాఖ , సోషల్ వెల్ఫెర్ , ట్రైబల్ వెల్ఫెర్ అధికారులు ఉన్నారు. దీనికి 1098 టోల్ ఫ్రీ నంబర్ తో పాటు ఆన్ లైన్ పిర్యాదు చేయాలనుకుంటే పెన్సిల్ పోర్టల్ ద్వారా పిర్యాదు చేయవచ్చని కార్మిక శాఖ తెలిపింది.


You may also like