ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఐపీఎల్ 16వ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్ కి తెరలేవనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలను ఆహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు. అయితే, ఐపీఎల్ 2023కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
READ ALSO: మాస్టర్ సినిమా హీరోయిన్ సాక్షి శివానంద్ ఎంతలా మారిపోయిందో చూడండి!
Advertisement
డేవిడ్ వార్నర్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అవకాశం ఇచ్చారు. ఈ ఫ్రాంచైజీకి కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్…. గత ఏడాది చివరన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో పంత్ కు తీవ్ర గాయాలు కావడంతో… టీమ్ ఇండియా తో పాటు ఐపీఎల్ సిరీస్ కూడా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో పంత్ స్థానంలో అనుభవగ్యుడైన కెప్టెన్ ను నియమించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో సుదీర్ఘకాలం కెప్టెన్ గా పని చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్… డేవిడ్ వార్నర్ కు కెప్టెన్గా అవకాశం ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్.
Advertisement
READ ALSO : రాజయోగం కోసమే NTR రెండు పెళ్లిళ్లు చేసుకున్నారా… దీనికి కారణం అతనే !
2015లో హైదరాబాద్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత హైదరాబాద్ ను చాంపియన్ గా కూడా నిలిపాడు. ఐదుసార్లు ప్లే ఆప్స్ వరకు హైదరాబాద్ జట్టు తీసుకువెళ్లాడు. సన్రైజర్స్ హైదరాబాద్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ లో ఒకటిగా నిలిపాడు డేవిడ్ వార్నర్. కానీ 2021 ఐపిఎల్ సీజన్ లో డేవిడ్ వార్నర్ ను జట్టు నుంచి పంపించేసింది హైదరాబాద్ జట్టు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని తీసుకుంది. ఈ తరుణంలోనే తాజాగా అతనికి కెప్టెన్సీ కూడా ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్.
Also Read: చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు రావడం లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కంటే ఎక్కువ ఆయనే కృషి చేశారా..?