Home » ఆ 4 యాప్స్ వెంట‌నే డిలీట్ చేయండి.. మ‌ళ్లీ ఆ మాల్‌వేర్ వ‌చ్చేసింది..!

ఆ 4 యాప్స్ వెంట‌నే డిలీట్ చేయండి.. మ‌ళ్లీ ఆ మాల్‌వేర్ వ‌చ్చేసింది..!

by Anji
Ad

స్మార్ట్ ఫోన్ వినియోగించ‌డం ఎంత సౌక‌ర్యంగా ఉంటుందో రిస్కులు కూడా అదేవిధంగా ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు మాల్‌వేర్ రూపంలో ముప్పు వ‌స్తూనే ఉంటుంది. ఇక పాత మాల్‌వేర్ మ‌ళ్లీ కొత్త రూప‌లో వ‌చ్చేసింది. హానిక‌ర‌మైన ఈ 4 యాప్స్‌లో మాల్‌వేర్ బ‌య‌ట‌ప‌డింది. ఇప్ప‌టికే నాలుగు యాప్స్‌ను 100,000 పైగా యూజ‌ర్స్ డౌన్‌లోడ్ చేశార‌ని స‌మాచారం. ఈ నాలుగు యాప్స్‌లో బ‌య‌ట‌ప‌డ్డ మాల్‌వేర్ పేరు జోక‌ర్.

Advertisement

స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు జోక‌ర్ మాల్‌వేర్ కొత్త ఏమి కాదు. ఇప్ప‌టికే వంద‌లాది యాప్స్‌లో ఈ మాల్‌వేర్ వెలుగులోకి వ‌చ్చింది. గూగుల్ అప్ర‌మ‌త్త‌మై ప్లే స్టోర్ నుంచి ఈ యాప్స్‌ను డిలీట్ చేసింది. కొంచెం గ్యాప్ త‌రువాత మ‌ళ్లీ నాలుగు యాప్స్‌లో జోక‌ర్ మాల్‌వేర్ వెలుగులోకి వ‌చ్చింది. సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ ప్రేడియో ప‌రిశోధ‌న ప్ర‌కారం.. నాలుగు యాప్స్‌లో జోక‌ర్ మాల్‌వేర్ ఉంది. స్మార్ట్ ఎస్ఎంఎస్ మెసెజ్ యాప్ 50,000+ఇన్ స్టాల్స్ బ్ల‌డ్ ప్రెజ‌ర్ మానిట‌ర్ యాప్ 10,000 పైగా ఇన్‌స్టాల్స్ ఉన్నాయి. ఇక వాయిస్ లాంగ్వెజెస్ ట్రాన్స్‌లెట‌ర్ యాప్ 10,000+ పైగాఇన్‌స్టాల్‌, క్విక్ టెక్స్ట్ ఎస్ఎంఎస్ యాప్ ఇన్‌స్టాల్ ఉన్న‌ట్టు తెలింది. మీరు కూడా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసిన‌ట్ట‌యితే వెంట‌నే డిలీట్ చేయండి.

Advertisement

తాజాగా బ‌య‌ట‌ప‌డ్డ మాల్‌వేర్ గూగుల్ రూపొందించిన యాప్‌లో సాధార‌ణ భ‌ద్ర‌త స్క్రీనింగ్‌ను బైపాస్ చేస్తుంద‌ని తేలింది. జోక‌ర్ మాల్‌వేర్ ఉన్న యాప్స్‌ను ప్లే స్టోర్‌లో స్క్రీనింగ్ ద్వారా గుర్తించ‌డం చాలా క‌ష్టం. గూగుల్ ప్లే స్టోర్ భ‌ద్ర‌తా ప్ర‌క్రియ‌ను మెరుగుప‌రిచిన‌ట్టు గూగుల్ వివ‌రించింది. గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్స్‌లో జోక‌ర్ మాల్‌వేర్ త‌ర‌చూ బ‌య‌ట‌ప‌డుతుంది. ఫ‌లితంగా ల‌క్ష‌లాది మంది ఈ మాల్‌వేర్ బారిన ప‌డుతున్నారు. స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ముఖ్యంగా ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసే ముందు డెవ‌ల‌ప‌ర్ పేరు త‌ప్ప‌నిస‌రిగా చూడాలి. లైసెన్స్‌డ్ వైర‌స్ యాప్ ఉప‌యోగించ‌డం బెట‌ర్‌.

Also Read : 

వైరల్ అవుతున్న ఎస్వీ రంగారావు పెళ్లి ఫోటో…ఆయన గురించి ఎవరికీ తెలియని నిజాలివే..!

మ‌హిళ‌లు ఆరోగ్యం విష‌యంలో ఆ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌కుండా పాటించాలంటున్న సినీ న‌టి అర్చ‌న.. లేకుంటే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు..!

Visitors Are Also Reading