Home » ప్రభాస్ పాన్ ఇండియా ‘ప్రాజెక్ట్ ‘ పై క్రేజీ అప్ డేట్

ప్రభాస్ పాన్ ఇండియా ‘ప్రాజెక్ట్ ‘ పై క్రేజీ అప్ డేట్

by Bunty
Ad

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు కేవలం సౌత్ లోనే కాకుండా దేశ విదేశాల్లో సైతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘బాహుబలి’ చిత్రంతోనే ఆయన క్రేజ్ ఎవరెస్టును దాటిపోయింది. అప్పటి నుంచి ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న మరో పాన్ ఇండియా చిత్రం “ప్రాజెక్ట్ కె”. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాక స్టార్ట్ చేయనున్నాడు ప్రభాస్. దీని కోసం ఆయన బల్క్ డేట్స్ కేటాయించాడట. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగా, ఇప్పుడు ఓ కీలక షెడ్యూల్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Advertisement

Deepika-Padukone

Advertisement

ఇక ఆ క్రేజీ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ కోసం బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షెడ్యూల్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ నిర్మించారట. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ సినిమా షూటింగ్ లో దీపికా పదుకొనే పాల్గొననుంది. ఈ భారీ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Visitors Are Also Reading