Home » ధోని హెయిర్ స్టైల్‌ మార్చడానికి దీపికానే కారణమా..?

ధోని హెయిర్ స్టైల్‌ మార్చడానికి దీపికానే కారణమా..?

by Azhar
Ad
టీమ్ ఇండియాకు మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. క్రికెట్ ప్రపంచంలో ఈ ఘనత అందుకున్న ఏకైన కెప్టెన్ కూడా ధోనినే. అయితే ధోని 2004 లో భారత జట్టు తరపున తన మొదటి మ్యాచ్ అనేది ఆడాడు. ఇక ధోని అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టినప్పుడు అతని హెయిర్ స్టైల్‌ ను ఎవరు మర్చిపోలేరు. లాంగ్ హెయిర్ తో అందరికి కనిపించిన ధోని పై కొన్ని విమర్శలు వచ్చిన తర్వాత అందరూ ధోని స్టైల్‌ నే ఫాలో కావడం ప్రారంభించారు. ఇండియాలోని అందరూ సినిమా సెలబ్రెటీలు ధోనిని అనుకరించారు.
ఇక 2006 లో టీం ఇండియా పాకిస్థాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు.. అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌.. ధోని హెయిర్ స్టైల్‌ మాట్లాడుతూ… నాకు ఆ హెయిర్ స్టైల్‌ బాగా నచ్చింది. ధోని ఎప్పటికి దానిని తీసేయకు అని చెప్పాడు. కానీ కొంతకాలం తర్వాత ధోని తన హెయిర్ స్టైల్‌ ను మార్చేశాడు. ఆ లాంగ్ హెయిర్ ను తీసేసి మాములుగా కనిపించాడు. దాంతో ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. అసలు ధోని ఇలా ఉన్నటుండి తన హెయిర్ స్టైల్‌ ఎందుకు మార్చాడు అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అందకు కారణం ఓ హీరోయిన్ అని కూడా ఉన్నారు.
ధోని క్రికెట్ ప్రపంచంలో ఎదుగుతున్న సమయంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునేతో ప్రేమాయణం నడిపించినట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గిన విధంగానే ఈ ఇద్దరు చాలా చోట్ల దర్శనం ఇచ్చారు. ఇక ఆ సమయంలోనే ఓ సారి దీపికా పదుకునే ధోనిని షాట్ హెయిర్ తో చూడాలని కోరిందట. ఆమె కోరిక మేరకే ధోని తన లాంగ్ హెయిర్  ను తీసేసాడు అనే ప్రచారం తెగ జరిగింది. కానీ ఇందులో నిజం ఎంత అనేది మాత్రం తెలియదు. కానీ ధోని తన లాంగ్ హెయిర్ ను తీసేయడం మాత్రం చాలా మంది అభిమానులను బాధించింది అనేది మాత్రం నిజం.

Advertisement

Visitors Are Also Reading