Home » దీపక్ చాహర్ హనీమూన్ కు బోల్డ్ సలహా ఇచ్చిన అక్క మాలతీ చాహర్..!

దీపక్ చాహర్ హనీమూన్ కు బోల్డ్ సలహా ఇచ్చిన అక్క మాలతీ చాహర్..!

by Azhar
Ad

భారత యూత్ స్టార్ పేసర్ దీపక్ చాహర్ ఈ నెల 2న తన ప్రేయసి జయ భరధ్వాజ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఐపీఎల్ 2021 సీజన్ లో లీగ్ మ్యాచ్ ల సమయంలో స్టేడియంలోనే అందరి ముందు జయకు తన ప్రేమను తెలిపాడు దీపక్. ఆ తర్వాత వీరిద్దరూ పెద్దల సమక్షంలో తాజాగా పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరూ హనీమూన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దీపక్ చాహర్ అక్క మాలతీ చాహర్ హనీమూన్ విషయంలో ఓ బోల్డ్ సలహా తన తమ్మునికి ఇచ్చింది. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

Advertisement

అయితే మాలతీ చాహర్ తన ట్విట్టర్ లో… ‘ ఇక ఇప్పుడు జయా భరద్వాజ్ మా ఇంటి పిల్ల అయ్యింది. మీరు మీ జీవితంలో హ్యాపీగ ఉండాలి అని అనుకుంటున్నాను. అయితే తమ్ముడూ.. ఇప్పుడు హనీమూన్ లో నీ నడుము జాగ్రత్తగా చూసుకో ప్లీజ్. ఎందుకంటే మనకు ఇప్పుడు టీ20 ప్రపంచకప్ ఉంది..’ అంటూ ట్వీట్ చేసింది. దాంతో ప్రజలు ఈ ట్విట్ పై ట్రోలింగ్ చేస్తున్నారు. కొంతమంది అక్కగ ఇలాంటి కామెంట్స్ చేయకూడదు అని కొందరు అంటే మరికొందరు ఇందులో తప్పు ఏం ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ ఏడాది నవంబర్ లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ 2022 మెగవేలంలో 14 కోట్లు ఖర్చు చేసి దీపక్ చాహర్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తీసుకోగా.. అతను గాయం కారణంగా మొత్తం సీజన్ కు దూరమయ్యాడు. అందువల్ల చాహర్ లేని లోటు చెన్నై బౌలింగ్ లో స్పష్టంగా కనిపించింది. అయితే ఈ యల్ సమయంలో పూర్తిగా రికవరీ అయిన చాహర్ ను ఈ నెల 9 నుండి ప్రారంభం అవుతున్న టీ20 సిటీస్ కు ఎంపిక చేయలేదు. కానీ ప్రపంచ కప్ సమయానికి అతను జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

ఆ 5 వేల మందికి అన్నం పెట్టడానికే నేను ఐపీఎల్ లో పని…

2008 లోనే రిటైర్ అవుదాం అనుకున్న సెహ్వాగ్ ను అడ్డుకున్న సచిన్..!

Visitors Are Also Reading